Vice President election: ఒద్దన్నా ఓటేశారని ఇద్దరు ఎంపీలకు నోటీసులు

Vice President election: ఒద్దన్నా ఓటేశారని ఇద్దరు ఎంపీలకు నోటీసులు

Two MPs faces showcase notice for voting Vice President election

Vice President election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేక, విపక్షాలు ఎవరూ సంప్రదించక ఓటింగ్‭కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ నిర్ణయాన్ని కాదని ఇద్దరు ఎంపీలు ఓటేసి చిక్కుల్లో పడ్డారు. పార్టీ నిర్ణయించినా ఓటేస్తారా అంటూ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా దీనిపై వివరణ ఇవ్వాలని లోక్‌సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధోపాధ్యాయ ఆ ఇద్దరు ఎంపీలకు లేఖలు రాశారు.

ఇంతకీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటేసి ఆ ఇద్దరిలో ఒకరు శిశిర్ అధికారి, మరొకరు ఆయన కుమారుడు దిబ్యేందు అధికారి. ఆ ఇద్దిరికి లేఖలు రాసిన సుదీప్ బంధోపాధ్యాయ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఉన్న సువేందు అధికారి తండ్రి. ఇక ఓట్లేసిన వారిలో శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ కాంతి నియోజకవర్గం నుంచి మూడుసార్లు టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. ఆయన మరో కుమారుడు దిబ్యేందు అధికారి 2019లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే వీరు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరినా టీఎంసీకి రాజీనామా చేయలేదు. దీంతో అధికారికంగా వారు తమ పార్టీ వారేనని, వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీఎంసీ హడావుడి చేస్తోంది.

Missing Poster Reunited: 9 ఏళ్ల క్రితం కిడ్నాపైన బాలిక.. పక్కనే ఉన్నా ఇళ్లు చేరడానికి 9 ఏళ్లు పట్టింది