Omicron Cases: భారత్‌లో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయిలో ఉందా?

దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. శుక్రవారం(17 డిసెంబర్ 2021) దేశంలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి.

Omicron Cases: భారత్‌లో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయిలో ఉందా?

Omicron (8)

Omicron Cases: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. శుక్రవారం(17 డిసెంబర్ 2021) దేశంలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినవారి సంఖ్య 113కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 12, ​​మహారాష్ట్రలో 8, కేరళలో రెండు కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో కొత్త వేరియంట్‌లు మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ మొత్తం 40 మందిలో ఇది నిర్ధారించబడింది. అదే సమయంలో ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17 కేసులు నమోదయ్యాయి.

Omicron కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. యూరప్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఒమిక్రాన్ రూపం వేగంగా వ్యాపిస్తోందని, ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

భారత్‌లో ఓమిక్రాన్ కేసులు – 113
మహారాష్ట్ర -40
ఢిల్లీ -22
రాజస్థాన్ -17
కర్ణాటక -8
తెలంగాణ -8
కేరళ -7
గుజరాత్ -7
పశ్చిమ బెంగాల్ -1
ఆంధ్రప్రదేశ్ -1
చండీగఢ్ -1
తమిళనాడు -1

ఒమిక్రాన్ ప్రస్తుతానికైతే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయిలో లేదు.. కానీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఓమిక్రాన్ రూపం భారతదేశంలో విస్తృతంగా ఉందని, ట్రాన్స్‌మిషన్ స్థాయిలోకి వెళ్తుందా? లేదా? అనేది అప్పుడే చెప్పలేమని అన్నారు.

డెల్టా వ్యాప్తి కంటే, ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ప్రమాదకరంగా ఉందని, సౌతాఫ్రికాలో డెల్టా వైరస్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉన్న చోట, ఒమిక్రాన్.. డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని WHO స్పష్టంగా చెబుతుంది. వ్యాక్సినేషన్‌తో పాటు మాస్కులు, భౌతిక దూరం, వెంటిలేషన్, పరిశుభ్రత పాటించాలని అధికారులు చెబుతున్నారు.