3 Wheels car : మూడు చక్రాల కారు…ధర రూ. 4.5 లక్షలు : సింగిల్ ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం

3 Wheels car : మూడు చక్రాల కారు…ధర రూ. 4.5 లక్షలు : సింగిల్ ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం

Two Seater Electric 3 Wheels Car With 200 Km Range

Two seater 3 Wheels electric  car with 200 km range : పెట్రోల్-డీజిల్ వాహనాలకు రానున్న కాలంలో కాలం చెల్లిపోనుంది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలమీదనే దృష్టి సారిస్తున్నారు. పెట్రోల్-డీజిల్ రోజు రోజుకు పెరగటం..మరోపక్క కాలుష్యం పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లుతోంది. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే అనేక ప్రత్యేకతలు కలిగిన అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ కారును స్ట్రోమ్ మోటార్స్ తీర్చిదిద్దింది. ఈ కారుకు కంపెనీ పేరుతో ‘స్ట్రోమ్ ఆర్3’ అనే పేరు పెట్టింది.

3

భారత్‌లో ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ అప్పుడే ప్రారంభమైపోయాయి కూడా. ముంబైతో పాటు ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఈ కారును రూ. 10 వేలతో బుక్ చేసుకోవచ్చు. ఈ కారు లుక్ విషయానికొస్తే అన్ని కార్ల వలే నాలుగు చక్రాలు కాకుండా మూడు చక్రాలతో నడుస్తుంది. అంటే ఆటోలా ఉంటుందని అనుకోవద్దు. ఆటోకు ముందు ఒక చక్రం వెను రెండు చక్రాలు ఉంటాయి. కానీ ఈ స్పెషల్ కారుకు ముందు రెండు చక్రాలు..వెనక ఒక చక్రం ఉంటుంది. దీంతో ఈ కారు లుక్ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది.

4

ప్రపంచంలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదేనని స్ట్రోమ్ మోటార్స్ కంపెనీ చెబుతోంది. అలాగే సింగిల్ ఛార్జింగ్‌తో స్ట్రోమ్ ఆర్ 3 కారు సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు కంపెనీవారు. ఈ కారుకు 4జీ కనెక్టెడ్ డయాగ్నోస్టిక్ ఇంజన్ అమర్చారు. ఇప్పటి వరకూ ఈ కారుకు సంబంధించి 165 యూనిట్లు బుక్ అయ్యాయి. టూ సీటర్స్ కలిగిన ఈ కారు ధర రూ. 4.5 లక్షలుగా సంస్థ పేర్కొంది.

Capture

రూ.10వేలు కట్టి కారు బుక్ చేసుకోవచ్చు. స్ట్రోమ్ ఆర్ 3 కారు భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అని చెబుతోంది స్ట్రోమ్ మోటార్ కంపెనీ. కాగా స్ట్రోమ్ మోటార్ కంపెనీ 2016లో స్థాపించబడింది. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా’ ఎలక్ట్రిక్ కారు అనొచ్చు.