South Africa Returnees : దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుంద‌ని

South Africa Returnees : దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా

Covid (1)

South Africa Returnees  దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుంద‌ని.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో అన్ని దేశాలు అల‌ర్ట్ అయ్యాయి. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని దేశాలతో పాటు భారత్ కూడా చర్యలు తీసుకుంటోంది.

అయితే ఇలాంటి తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా టెస్ట్ లు చేయగా..పాజిటివ్ గా తేలింది. అయితే ఆ ఇద్దరికి సోకింది ఒమిక్రాన్​ కాదని.. డెల్టా వేరియంట్​ అని తేలిందని కర్ణాటక ఆరోగ్య కార్యదర్శి టీకే అనీల్ కుమార్ తెలిపారు. బెంగళూరు ల్యాబ్ లోనే సీక్వెన్సింగ్ ప్రక్రియ చేపట్టామని..ఇద్దరికీ సోకింది డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ అని తెలిపారు.ప్రస్తుతం ఆ ఇద్దరు క్వారంటైన్​లో ఉన్నట్టు, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు​ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా,ఈ నెల 1 నుంచి 26వరకు మొత్తం మీద 584 మంది వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో 94మంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరుతో పాటు క‌ర్ణాట‌క మొత్తం పోలీసులు, వైద్య సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ముఖ్యంగా బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న అంత‌ర్జాతీయ ప్రయాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశాక‌నే బ‌య‌టికి పంపిస్తున్నారు.

కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపడుతున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, బోట్స్‌వానాలో ఓమిక్రాన్‌ వ్యాధిని గుర్తించామని, అయితే కర్ణాటకలో మాత్రం ఇంకా దాని ఆచూకీ లేదని మంత్రి చెప్పారు. నివారణ చర్యలపై శుక్రవారం సమావేశం నిర్వహించామని.. మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

హైరిస్క్ దేశాల నుండి వచ్చే వ్యక్తులు బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత RT-PCR టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని, పాజిటివ్ అని తేలితే వారిని ట్రీట్మెంట్ కోసం విమానాశ్రయం,దాని చుట్టుపక్కలే తగిన ఏర్పాటు చేసి వారిని ఉంచుతామన్నారు. హైరిస్క్ దేశాల నుంచి వచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌ తప్పనిసరి అని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి విమానాశ్రయంలో ఆరోగ్య శాఖ అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు.

ALSO READ Major Cargo Ship Collision : అరేబియా సముద్రంలో ఢీకొన్న భారీ కార్గో షిప్ లు