Encounter Two Terrorists Killed : జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

Encounter Two Terrorists Killed : జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter Two Terrorists Killed : జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. శనివారం రాత్రి బాలాకోట్ లోని పూంచ్ సెక్టార్ లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పద కదలికలను గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంతమంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదులు ఇటీవల రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులతో సంబంధం కలిగివున్నట్లు తెలిపారు.

Three Terrorists Killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

కాగా, జనవరి1న రాజౌరీ జిల్లాలోని దంగ్రీ గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి జమ్మూలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. దీంతో మృతుల సంఖ్య 7కు చేరింది.