Encounter : కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు

Encounter : కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Encounter

Encounter : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుంది. కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం ఉగ్రవేట కొనసాగిస్తుంది. షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతాబలగాలు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ప్రముఖ వార్త సంస్థ ani తెలిపింది.

చదవండి : Encounter : అనంత్‌నాగ్‌‌‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున, జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ముమన్‌హాల్ (అర్వానీ) ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్‌లో ఉగ్రవాది నుంచి AK-47ను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి : Encounter: ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి