టూ వీలర్ రైడర్లకు గవర్నమెంట్ హెచ్చరిక

టూ వీలర్ రైడర్లకు గవర్నమెంట్ హెచ్చరిక

BIS helmets: ఇండియాలో ఇక నుంచి టూ వీలర్ ఓనర్స్ (BIS) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్స్ మాత్రమే వాడాలని ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న లో క్వాలిటీ హెల్మెట్లను అరికట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా రోడ్ యాక్సిడెంట్లలో జరిగే ప్రాణ నష్టం తగ్గుతుందని భావిస్తున్నారు.

‘ద మినిష్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ టూవీలర్ రైడర్స్ అందరికీ హెల్మెట్ 2020 తప్పనిసరి చేసింది’ అని చెప్తుంది. దాంతో పాటే రక్షణ కల్పించగల హెల్మెట్స్ ను మాత్రమే అంటే బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న వాటినే వాడాలని, క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ కు లోబడే అవి తయారవుతాయని చెప్తుంది ఆ స్టేట్‌మెంట్.



రోడ్ సేఫ్టీపై సుప్రీం కోర్ట్ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇండియా వాతావరణానికి సరిపడే హెల్మెట్లను మాత్రమే అందిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కమిటీలో పలు ఫీల్డ్‌లలోని నిపుణులతో చర్చించారు. AIIMS, BISల నుంచి కూడా పలువురు ఉన్నారు.
https://10tv.in/purnia-central-jail-prison-to-have-atm/
మార్చి 2018లో కమిటీ.. దేశంలో వాడుతున్న లైటర్ హెల్మెట్స్‌పై పూర్తి విశ్లేషణతో కూడిన రిపోర్టు ఇచ్చింది. ఇండియాలో సంవత్సరానికి 1.7కోట్ల టూవీలర్స్ తయారీ జరుగుతుంది.