Kid Overweight: రెండేళ్ల వయస్సున్న పాప బరువు 45కిలోలు!!

రెండేళ్ల వయస్సున్న పాప అధిక బరువుతో బాధపడుతుంది. అది కూడా కడుపు పరిమాణం పెరగడంతో వీల్ ఛైర్ లోనే తీసుకెళ్లి ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించారు. దశాబ్ద కాలంలో చేసిన బారియాటిక్ సర్జరీల్లో వయస్సు రీత్యా పాపనే చాలా చిన్నదని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది.

Kid Overweight: రెండేళ్ల వయస్సున్న పాప బరువు 45కిలోలు!!

Bariatric Surgery

Kid Overweight: రెండేళ్ల వయస్సున్న పాప అధిక బరువుతో బాధపడుతుంది. అది కూడా కడుపు పరిమాణం పెరగడంతో వీల్ ఛైర్ లోనే తీసుకెళ్లి ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించారు. దశాబ్ద కాలంలో చేసిన బారియాటిక్ సర్జరీల్లో వయస్సు రీత్యా పాపనే చాలా చిన్నదని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది.

పట్పార్గంజ్ లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు.

‘బారియాట్రిక్ సర్జరీ అనేది చిన్న పిల్లలకు చాలా అరుదుగా చేస్తారు. ఇండియాలో దశాబ్ద కాలంలో జరిపిన బారియాట్రిక్ సర్జరీల్లో పాప చాలా చిన్న వయస్కురాలు. మెడికల్ ఎమర్జెన్సీ కింద ట్రీట్మెంట్ అందించామని’ హాస్పిటల్ స్టేట్మెంట్ విడుదల చేసింది.

ఈ సర్జరీ ఫలితంగా పేషెంట్లలో మానసిక తృప్తి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడానికి కారణమవడంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది. కడుపులో కొత్తగా ఏర్పాటు చేసిన పౌచ్ లో కొద్ది పాటి పరిమాణమే పడుతుండటంతో తీసుకునే ఆహారం కూడా తగ్గించి తీసుకుంటారు.

‘ఈ చిన్నారి పుట్టినప్పుడు 2.5కేజీల బరువు ఉంది. ఆమె బరువు క్రమంగా పెరుగుతూ.. ఆరు నెలల్లోనే 14కేజీలకు చేరింది. అదే వయస్సుతో ఉన్నప్పుడు పాప సొంత అన్న సాధారణ బరువుతోనే ఉండేవాడట. కానీ, పాప వయస్సుకు మించిన బరువు పెరుగుతూ రెండు సంవత్సరాల మూడు నెలలకు 45కేజీల వరకూ పెరిగింది’ అని డా. సేథీ అన్నారు.

ఆ వయస్సులో సాధారణంగా 12నుంచి 15కేజీల వరకూ బరువు ఉండాలి.

‘ఈ నిర్ణయం కఠినమైనదైనా తీసుకోకతప్పలేదు. బారియేట్రిక్ సర్జరీ చేస్తేనే పాప బతుకుతుందని నిర్ధారించుకున్నాం. బరువు పెరిగి పేరెంట్స్ కూడా ఆమెను మోయలేకపోయారు. అందుకే సంవత్సరం 10నెలల నుంచే వల్ ఛైర్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు’ అని డాక్టర్ వివరించారు.

పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నాం. చిన్నారి ఆహార కుహరం చాలా చిన్నదిగా ఉంది. రక్త పరిమాణం కూడా తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడేది. సర్జరీ ద్వారా కడుపు భాగాన్ని తొలగించి ల్యాపరోస్కోపిక్ గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ లేదా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఏర్పాటు చేశామని డా. వివేక్ బిండాల్ అన్నారు.

సర్జరీ సమయంలో రెండేళ్ల పాప కావడంతో పొట్ట కింది భాగం నరాలు జాగ్రత్తగా డీల్ చేశాం. బ్లీడింగ్ కాకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సర్జరీ తర్వాత అనిస్తీషియా నుంచి పాప సురక్షితంగా బయటపడింది. గతంలో దీనికి సంబంధించిన ఎటువంటి రిఫరెన్స్ లు లేకపోవడంతో కాస్త కష్టంగా అనిపించింది. సర్జరీ తర్వాత చిన్నారి బరువును క్రమంగా తగ్గించడానికి ప్రత్యేక ఆహార నియమాలు అనుసరించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.