UAE passengers: యూఏఈ నుంచి వచ్చే వారికి RT-PCR పరీక్షలు లేవు

బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదివారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులైన యూఏఈ నుంచి వచ్చేవారు సైతం ఆర్టీ-పీసీఆర్, ఏడు రోజుల హోం క్వారంటైన్ నుంచి మినహాయించారు.

UAE passengers: యూఏఈ నుంచి వచ్చే వారికి RT-PCR పరీక్షలు లేవు

Rt Pcr

UAE passengers: బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదివారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులైన యూఏఈ నుంచి వచ్చేవారు సైతం ఆర్టీ-పీసీఆర్, ఏడు రోజుల హోం క్వారంటైన్ నుంచి మినహాయించారు. రిస్క్ తో కూడిన దేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే గైడ్ లైన్స్ అప్లై అవుతాయని చెప్పింది.

2022 జనవరి 17 సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలుకానున్నట్లు తెలిపారు. బీఎంసీ కమిషనర్ ఇఖ్బాల్ సింగ్ చాహల్ అధ్యక్షతన జరిగిన సివిల్ అఫీషియల్స్, డీన్స్, మెడికల్ సూపరిండెంట్స్ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు.

ముంబైలో తారాస్థాయికి చేరిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోసారి కేసులు పెరిగే అవకాశం ఉందని డా.శశాంక్ జోషి హెచ్చరించారు. శనివారం ఒక్కరోజే 11కొవిడ్ మృతులు సంభవించగా తాజాగా 10వేల 661 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

 

ఇది కూడా చదవండి : తెలుగమ్మాయి న్యూజిలాండ్ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక

ఇంకా 21వేల 474మంది పేషెంట్లు డిశ్చార్జ్ కాగా 8లక్షల 99వేల 358మంది రికవరీ అయ్యారు.