Flight Travelling: విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలించిన యూఏఈ, సింగపూర్

భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలిస్తూ యూఏఈ, సింగపూర్ దేశాలు పలు సూచనలు చేసాయి.

Flight Travelling: విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలించిన యూఏఈ, సింగపూర్

Dubai

Flight Travelling:  భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలిస్తూ యూఏఈ, సింగపూర్ దేశాలు పలు సూచనలు చేసాయి. భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపిన వివరాలు మేరకు.. భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కి తిరిగి వచ్చే కొందరు ప్రయాణికులకు RT PCR(బయలుదేరే ముందు) పరీక్ష నుండి మినహాయింపు ఇచ్చారు. ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు పొందిన వారికి మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. దుబాయ్ వచ్చే ఇతర దేశాల ప్రయాణికులకు, పర్యాటకులకు కోవిడ్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కొన్ని రోజుల క్రితమే యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించింది యూఏఈ ప్రభుత్వం. ఈక్రమంలో రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారిని మాత్రమే ఈ నియమాలు వర్తించేలా సూచనలు చేసారు.

Also read: WHO Covid Tests : కోవిడ్ టెస్టులు తగ్గడంపై WHO ఆందోళన.. అలసత్వం వద్దు..!

ఇక భారత్ నుంచి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు ఆంక్షలు సడలించింది సింగపూర్ ప్రభుత్వం. ఫిబ్రవరి 22 నుంచి సడలించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేట్ ట్రావెల్ లేన్ (VTL) ప్రత్యేక కార్యక్రమం ద్వారా.. సింగపూర్ వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్ రిపోర్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే విమాన ప్రయాణానికి ముందు నిర్వహించాల్సిన ఇతర తనిఖీలను(కరోనా టెస్ట్ రిపోర్ట్స్, వ్యాక్సిన్ పత్రాలు) మరికొన్ని రోజుల పాటు కొనసాగించనున్నట్లు అక్కడి విమానయానశాఖ అధికారులు ప్రకటించారు.

Also read: Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి