Udaipur Mall : డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించవద్దంట…నెటిజన్ల ఘాటు వ్యాఖ్యలు

జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయవద్దని, మెట్ల వైపు నుంచే వెళ్లాలని సూచిస్తూ..నోటీసు బోర్డు పెట్టింది.

Udaipur Mall : డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించవద్దంట…నెటిజన్ల ఘాటు వ్యాఖ్యలు

Food

Swiggy & Zomato Delivery Guys : ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించవద్దంటూ..అంటించిన ఓ నోటీసు ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నోటీసును జర్నలిస్టు శోభనా నాయర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఆధునిక కాలపు బూ స్వామ్యం అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. డెలివరీ బాయ్స్ ఇబ్బందులకు గురి చేసేలా ఉందంటూ పలువురు నెటిజన్లు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వివక్షత కొనసాగుతోందా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. డెలివరీ బాయ్స్ పట్ల వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పలురకాలుగా నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

Read More : Prabhas-Rajamouli: క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా.. మొదలైన కథా చర్చలు!

ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో, స్విగ్గీలు కస్టమర్లకు డెలివరీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ సంస్థల్లో చాలా మంది డెలివరీ బాయ్స్ పని చేస్తుంటారు. ఆర్డర్ చేసిన కస్టమర్ల ఇంటికి నేరుగా వీరు అందిస్తుంటారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి..ఫుడ్స్ ను అందిస్తుంటారు. ప్రధానంగా కరోనా కాలంలో..వీరు అందించిన సేవలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఆహారం, నిత్య అవసరాలను ఇళ్ల వద్దకే నేరుగా తీసుకొచ్చి అందించారు.

Read More : Bajaj : హైదరాబాద్‌‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు, ఎక్కడో తెలుసా

అయితే..ఉదయ్ పూర్ లోని ఒక మాల్ డెలివరీ బాయ్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయవద్దని, మెట్ల వైపు నుంచే వెళ్లాలని సూచిస్తూ..నోటీసు బోర్డు పెట్టింది. వినియోగదారులకు సమయానికి ఫుడ్ అందించలేకపోతారని, మరో ఆర్డర్ ను కూడా తీసుకోలేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నోటీసు తెగ వైరల్ అవడంతో…నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అందుకే ఇంకా దేశం వెనుకబడి ఉందంటూ..కామెంట్స్ చేస్తున్నారు.