Maharashtra: జెండా ఎత్తినంత మాత్రాన దేశభక్తి ఉన్నట్లు కాదు: బీజేపీపై ఉద్ధవ్ ఫైర్

ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావాలి’ అని ఉన్న కార్టూన్‭ను ఉదహరిస్తూ అన్నారు). ఈరోజు కూడా చైనీయులు మన భూభాగంపై దాడి చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‭లో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇళ్లపై త్రివర్ణ పతాకం పెడితే వాళ్లకు వెనక్కి వెళ్తారా? ఆ పతాకం మన గుండెల్లో ఉండాలి’’ అని ఉద్ధవ్ అన్నారు.

Maharashtra: జెండా ఎత్తినంత మాత్రాన దేశభక్తి ఉన్నట్లు కాదు: బీజేపీపై ఉద్ధవ్ ఫైర్

Uddhav Thackeray On Har Ghar Tiranga Drive

Maharashtra: జెండా ఎత్తినంత మాత్రాన దేశభక్తి ఉన్నట్లు కాదని భారతీయ జనతా పార్టీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఏడాదిపాటు వేడుకలు నిర్వహిస్తోంది. కాగా, 75వ వార్షికోత్సవం దగ్గర పడిన తరుణంలో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

కాగా, ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావాలి’ అని ఉన్న కార్టూన్‭ను ఉదహరిస్తూ అన్నారు). ఈరోజు కూడా చైనీయులు మన భూభాగంపై దాడి చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‭లో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇళ్లపై త్రివర్ణ పతాకం పెడితే వాళ్లకు వెనక్కి వెళ్తారా? ఆ పతాకం మన గుండెల్లో ఉండాలి’’ అని ఉద్ధవ్ అన్నారు.

ఇక సోషల్ మీడియాలో డీపీల గురించి ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘డీపీల్లో త్రివర్ణ పతాకం పెట్టుకోవడం చాలా గౌరవమే. కానీ సరిహద్దులో నిలబడి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు నిలువ నీడ లేదు. దాని కోసం బడ్జెట్‭లో కనీస నిధులు కేటాయించలేదు. ఒకవేళ మీరు(మోదీ ప్రభుత్వం) ఆర్మీలో సైనికుల్ని తగ్గిస్తే ఆయుధాలు ఎవరికి ఇస్తారు?’’ అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రభుత్వం గురించి ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఎమ్మెల్యేల్ని కొని కొత్త ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడానికి వందల, వేల కోట్లు ఉంటాయి కానీ, ఆర్మీలో సైనికుల్ని చేర్చుకోవడానికి మాత్రం ఉండవు’’ అని విరుచుకుపడ్డారు.

Freedom of Religion (Amendment) Bill: మత స్వేచ్ఛ బిల్లుకు హమాచల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం