London: భారత్ హెచ్చరిక.. దిగొచ్చిన బ్రిటన్.. UK కొత్త టీకా విధానం!

బ్రిటన్ తన వ్యాక్సినేషన్ విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ఇప్పుడు తన కొత్త ప్రయాణ నియమాలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ను ఆమోదించింది.

London: భారత్ హెచ్చరిక.. దిగొచ్చిన బ్రిటన్.. UK కొత్త టీకా విధానం!

Covishield

London: బ్రిటన్ తన వ్యాక్సినేషన్ విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ఇప్పుడు తన కొత్త ప్రయాణ నియమాలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ ను ఆమోదించింది. ఈ నిర్ణయంతో UK కి వెళ్లే భారతీయులు భారత్‌లో కోవిషీల్డ్ సర్టిఫికెట్‌ను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి బ్రిటన్ వెళ్లిన తర్వాత 14రోజుల పాటు నిర్బంధంలో ఉండవలసి ఉంటుంది.

గతంలో వ్యాక్సినేషన్ విధానంలో మార్పులు చేయాలని బ్రిటన్‌ను భారత్ ఇప్పటికే హెచ్చరించగా.. వ్యాక్సిన్ నిబంధనలకు సంబంధించి బ్రిటన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. “ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వాజేవేరియా మరియు మోడెర్నా టాకెడా వ్యాక్సిన్‌లను బ్రిటన్ ఆమోదించింది.” అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత సర్టిఫికేట్ ఉండడం మాత్రం తప్పనిసరి.

బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక:
వ్యాక్సిన్ విధానం గురించి భారత్ బ్రిటన్‌ను హెచ్చరించింది. అక్టోబర్ 4వ తేదీ లోపు భారతదేశ ఆందోళనలను పరిష్కరించకపోతే, బ్రిటన్ నుండి వచ్చే ప్రయాణికుల విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటామని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా హెచ్చరించారు. హర్షవర్ధన్ శ్రింగ్లా బ్రిటన్ విధానాన్ని వివక్షతగా అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ విధానంలో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. దీంతో బ్రిటన్ నియమావలిలో మార్పు వచ్చింది.

బ్రిటన్‌లోనూ ఒత్తిడి:
భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం ఏర్పాటు చేసిన నియమాలను సమీక్షించాలని UK ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. UK లోని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (AISAU) ప్రెసిడెంట్ సనమ్ అరోరా మాట్లాడుతూ, “భారతీయ విద్యార్థులు దీనిని వివక్షాపూరిత చర్యగా భావిస్తున్నారు” అని అన్నారు. బ్రిటన్‌లోనూ ఒత్తిడి రావడంతో యూకే సానుకూల నిర్ణయం తీసుకోక తప్పలేదు.

బ్రిటన్ నిబంధనలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, శశిథరూర్ కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకే నిబంధనలు జాతి వివక్షతను పెంచేలా ఉన్నాయని, ఇది మూమ్మాటికి నేరపూరిత చర్యేనని వారు అభిప్రాయపడ్డారు. కాగా కొవీషీల్డ్ వ్యాక్సిన్ వాస్తవానికి యూకేకు చెందిన సంస్థదే. యూకే అభ్యర్థన మేరకు 50లక్షల కొవీషీల్డ్ డోసులను భారత్ ఆ దేశానికి సరఫరా చేసింది. అయినా కూడా ప్రయాణికులపై నిబంధనలు పెట్టడం విమర్శలకు కారణం అయ్యింది. ఎట్టకేలకు యూకే నిర్ణయం తీసుకుంది.