జియోనా మజాకా : జైల్లో జియో సిగ్నల్స్‌ బ్లాక్ చేయలేకపోతున్నామన్న అధికారులు

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 06:02 AM IST
జియోనా మజాకా : జైల్లో జియో సిగ్నల్స్‌ బ్లాక్ చేయలేకపోతున్నామన్న అధికారులు

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు బెంబేలెత్తిపోయాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా.. ఫ్రీ..ఫ్రీ అంటూ.. టెలికాం మార్కెట్ ని షేక్ చేసింది జియో. తక్కువ సమయంలోనే వేగంగా దూసుకెళ్లింది. దేశ టెలికాం రంగంలో అత్యధిక వాటాను సొంతం చేసుకుంది. జియో దెబ్బ మాములూగా లేదు. ఇతర టెలికాం కంపెనీలు బాగా సఫర్ అవుతున్నాయి. జియో సిగ్నల్స్ ఎంత పవర్ ఫుల్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. తీహార్ జైల్లో చోటు చేసుకున్న ఘటన జియో సిగ్నల్స్ శక్తిని తెలుపుతుంది. జియో సిగ్నల్స్ కారణంగా తీహార్ జైలు అధికారులు హైకోర్టు ముందు చేతులు ఎత్తేయాల్సిన దుస్థితి వచ్చిందంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మ్యాటర్ లోకి వెళితే.. తమ దగ్గరున్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించలేకపోతున్నామని(block) అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. మరీ ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్స్‌ను నిరోధించడం సాధ్యం కావడం లేదన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోటోటైప్‌ జామర్‌ ను అభివృద్ధి చేయాల్సిందిగా సీ-డాట్‌ను కోరినట్టు కోర్టుకు వివరించారు. తీహార్‌ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాశాడు. జైలు అధికారులు డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, ఖైదీలకు డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాకుండా మొబైల్‌ ఫోన్స్‌, ఇతర నిషేధిత వస్తువులు అందజేస్తున్నారని, ఖైదీలను జంతువుల్లా చూస్తున్నారని ఆ వ్యక్తి ఆరోపించాడు.

దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు అందులో నిజానిజాలు తేల్చాల్సిందిగా ఓ జడ్జిని నియమించింది. జైల్లో పరిస్థితుల మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన జడ్జి.. 2019 ఏప్రిల్‌లో కోర్టుకి నివేదిక ఇచ్చారు. లేఖలో ఖైదీ ఆరోపించినట్టే.. జైలు లోపల నిషేధిత వస్తువులు ఉన్నాయని తెలిపారు. జైలు అధికారులు డబ్బు తీసుకుని ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు.

తాజాగా ఈ కేసుకి సంబంధించి మంగళవారం(ఫిబ్రవరి 04,2020) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిలీ​ ప్రభుత్వం తరఫున రాహుల్‌ మెహ్రా వాదనలు వినిపించారు. జైల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేశామని.. అలాగే శాఖ పరమైన విచారణకు కూడా ఆదేశించామని తెలిపారు. అలాగే జైలు లోపల 5వేల సీసీటీవీ కెమెరాలు, 50 బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జైల్లోకి ప్రవేశించే వారిని పూర్తి స్థాయిలో పరీక్షించడానికి బాడీ స్కానర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే ఈసీఐఎల్‌ అందజేసిన జామర్ల ద్వారా మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించినట్టు రాహుల్‌.. కోర్టుకు తెలిపారు. అయితే వాటి ద్వారా ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్‌ను బ్లాక్‌ చేయలేకపోయామని అన్నారు. జైలు లోపల మొబైల్ ఫోన్ల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. జైలు పరిసరాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించేలా ప్రత్యేక ప్రోటో టైప్‌ జామర్‌ను తయారు చేయాలని సీడాట్‌ ను కోరినట్టు కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. కేవలం ఖైదీలను పర్యవేక్షించడానికే మాత్రమే కాకుండా అధికారుల గదుల్లో కూడా సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.