మారని పాక్ బుద్ధి : సత్తా చాటిన భారత సేన

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 12:19 AM IST
మారని పాక్ బుద్ధి : సత్తా చాటిన భారత సేన

అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంది..ఎందుకంటే..అది పాక్ కదా. పుల్వామా దాడి తర్వాత ప్రపంచం ముందు దాదాపు ఏకాకి అయిన పాకిస్తాన్..బుద్ది మారదని తాజా పరిణామాలు చూస్తేనే తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దుతో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ప్రతి దేశం తిరిగినా..ఎవరూ మద్దతివ్వలేదు సరికదా చీవాట్లు పెట్టి పంపించిన దాఖలాలు బోలెడు..ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను ట్రైనప్ చేసి ఇండియాకి పంపించే ప్రయత్నాలు మాత్రం మానలేదు. దేశంలో ఈగల మోత మోగుతున్నా పట్టించుకోకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రతి చోటా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. బోర్డర్ దగ్గర చొరబాట్లకి ఎంత ట్రై చేసినా కుదరకపోవడంతో..టెర్రరిస్ట్‌లను మన దేశంలోకి దింపేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు..దానికి ప్రతిఫలమూ అనుభవిస్తోంది పాక్. 

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత బెంబేలెత్తిపోయిన పాక్..రాత్రికి రాత్రే దాదాపు 20 నుంచి 30 దాకా టెర్రరిస్ట్ టెంట్స్ ఎత్తేసింది..ఐతే రోజులు గడిచేకొద్దీ తిరిగి క్యాంప్‌లను ఆపరేట్ చేయడానికి రెడీ అయిపోయింది. దాదాపు 500మంది దాకా టెర్రరిస్ట్ ట్రైనీలు కశ్మీర్ లోయ ద్వారా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు సిధ్దంగా ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. అందుకు తగ్గట్లుగానే డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దులలో ఆయుధాలు డంప్ చేసిన పాక్ కుట్రని భారత్ తిప్పికొట్టింది. దాదాపు ఒక్క నెలలోనే 10 డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించాయంటే పాక్ తెగింపు అర్ధం చేసుకోవచ్చు. ఇలా డ్రోన్లను సమకూర్చుకోవడం కూడా ఆన్‌లైన్‌ ద్వారానే అంటే టెక్నాలజీని పాక్ ఎలా వాడుతుందో అర్ధమవుతోంది. తాజాగా భారత్ చేసిన దాడి పాకిస్తాన్‌కి పెద్ద వార్నింగ్‌గానే చూడాలి. 

జమ్మూ-కశ్మీర్ మొదలుకొని, రాజస్థాన్, గుజరాత్లోని సర్ క్రీక్ ప్రాంతం వరకూ ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. సముద్ర మార్గంలో దేశంలో చొరబడేందుకు ప్రయత్నించారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని పడవలు కూడా సైన్యానికి దొరికాయ్. ఇలాంటి నేపధ్యంలోనే ఇండియన్ ఆర్మీ ముందునుంచీ చెప్తున్నట్లుగానే..పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రటెంట్లపై దాడి చేసింది. ఒక్కటే ఒక్క దెబ్బ..ప్రత్యర్ధి అదిరిపడేలా కొట్టింది..ఇంతకు ముందువాడని ఆయుధాలను వాడి తమ సత్తా చాటింది. దీంతో ఉగ్రవాదులు, పాక్ సైనికులు కలిపి కనీసం 35మంది వరకూ ఫినిష్ అయి ఉంటారని అంటున్నారు. శత్రువుకి తన జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేసింది. 
Read More : 3 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం : ఆర్మీచీఫ్.జనరల్. బిపిన్