Rajasthan crisis: రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం.. సీఎంగా ఎవరిని నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ నిర్ణయం?

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Rajasthan crisis: రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం.. సీఎంగా ఎవరిని నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ నిర్ణయం?

Rajasthan crisis: రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పరిణామాలపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jupiter closest to Earth: నేడు భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం.. మళ్లీ 107 సంవత్సరాల తర్వాతే.. అందరూ చూడొచ్చంటున్న సైంటిస్టులు

తాజా పరిణామాల నేపథ్యంలో అధిష్టానం రాజస్థాన్ సీఎంగా ఎవరిని నియమించినా అంగీకరించాలనే నిర్ణయానికి అశోక్ గెహ్లాట్ వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన తర్వాత సీఎంగా ఎవరు ఉంటారన్న దానిపై అక్కడ రాజకీయం మొదలైంది. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 90 మంది రాజీనామా చేశారు. దీనికి కారణం.. అశోక్ గెహ్లాట్ తర్వాత సచిన్ పైలట్‌ను సీఎంగా చేస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో, దీన్ని వ్యతిరేకిస్తూ అశోక్ గెహ్లాట్ వర్గం రాజీనామాకు తెరతీసింది. తమ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Neelakurinji Flowers: పన్నెండేళ్లకు విరబూసిన నీలకురింజి పూలు.. అరుదైన దృశ్యాల్ని చూసి పులకిస్తున్న సందర్శకులు.. ఫొటోలు వైరల్

దీంతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది. అయితే, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజస్థాన్ కాంగ్రెస్‌కు సంబంధించి ప్రతి నిర్ణయం అశోక్ గెహ్లాట్‌ను అడిగే తీసుకున్నామని చెప్పింది. మరోవైపు ఈ వివాదాన్ని అశోక్ గెహ్లాట్ కావాలనే సృష్టించారని అధిష్టానం భావిస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలతో అశోక్ గెహ్లాట్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధిష్టానం సీఎంగా ఎవరిని నియమించినా అంగీకరించాలనే నిర్ణయానికి అశోక్ వచ్చినట్లు తెలుస్తుంది.