బడ్జెట్ 2019 : దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 07:40 AM IST
బడ్జెట్ 2019 : దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. మధ్య తరగతి, రైతులు, పెన్షన్, ఇలా కొన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. రయ్యమంటూ దూసుకెళుతున్నాయి. స్టాక్ మార్కెట్లు దూసుకపోతుండడంతో వ్యాపారవర్గాల్లో సంతోషం వ్యక్తమౌతోంది. రియల్ రంగం సూచీలు ఎగబాకాయి. 470 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభాల్లో ట్రేడవుతుండగా…నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.