బడ్జెట్ అంటే ఏంటి ? ఆసక్తికర విషయాలు

బడ్జెట్ అంటే ఏంటి ? ఆసక్తికర విషయాలు

Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బడ్జెట్ పత్రాలు ముద్రించకుండా…పేపర్ లెస్ గా ఉండనున్నది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే..హల్వా తయారు చేయడం సంప్రదాయబద్ధంగా వస్తోంది.

రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత..లోక్ సభ, రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే..బడ్జెట్ అంటే ఏమిటీ ? ఎందుకు ప్రవేశపెడుతారు ?

సాధారణంగా..ప్రతొక్కరూ నెలవారీకి సరిపడా ముందుగానే బడ్జెట్ ను రూపొందించుకుంటారనే విషయం తెలిసిందే. వచ్చిన డబ్బు..ఎంత..దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ? పొదుపు ఎంత చేసుకోవాలనే దానిపై ఆలోచించుకుని బడ్జెట్ రూపొందించుకుంటారని సంగతి తెలిసిందే. అదే విధంగా దేశ బడ్జెట్ కూడా ఉంటుంది. సంవత్సరం మొత్తం ఖర్చులు, ఆదాయాల అకౌంటింగ్ ను రూపొందిస్తారు.

ఇక బడ్జెట్ మూడు రకాలుగా ఉంటుంది. అందులో బడ్జెట్ అంచనా, సవరించిన అంచనా, వాస్తవాలు.

బడ్జెట్ అంచనా : మొత్తం సంవత్సరానికి సంబంధించింది. 2021-22 బడ్జెట్ అంచాన వేయగా..2021-22 లో ఆదాయాలు..ఖర్చలను మాత్రమే అంచనా వేయనుంది.

సవరించిన అంచనా : ఇది గత సంవత్సరానికి సంబంధించింది. గత సంవత్సరం యొక్క..సవరించిన అంచానాలను వెల్లడిస్తుంది. గత బడ్జెట్ లో ఎంత అంచనా వేశాం ? ఆదాయం ఎంత వచ్చింది ? ఖర్చులు ఎంత జరిగాయనేది తెలుసుకుంటుంది. సవరించిన అంచనా బడ్జెట్ అంచనా కంటే..తక్కువగా ఉండొచ్చు.

ఇక వాస్తవాలు :
రెండేడ్ల క్రితం నాటి బడ్జెట్, ప్రస్తుత బడ్జెట్ లో పేర్కొంటారు. రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం వాస్తవానికి ఎంత ఖర్చు పెట్టింది ? ఎంత ఖర్చు చేసింది ? అనే విషయాలపై స్పష్టతనిస్తారు.

ఆర్థిక సర్వే : –
బడ్జెట్ సమర్పించే దానికంటే ముందు..ఆర్థిక సర్వే ముందు వస్తుంది. సంవత్సరం మొత్తం ఖర్చులు, ఆదాయాలు, పొదుపులను లెక్కిస్తారు. భవిష్యత్ లో ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది ? ఏ ఏ రంగాలపై ప్రభావం చూపనుంది, ఎలా ఆదా చేయాలో అంచనా వేస్తారు. కానీ..ఈసారి ఎకనామిక్ సర్వేను బడ్జెట్ కు రెండు రోజుల ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం విశేషం. గత సంవత్సరం అకౌంటింగ్, రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లు, పరిష్కారాలను కలిగి ఉంటుంది. ఆర్థిక విభాగంలోని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తారు. మొదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు. 1964 వరకు దీనిని బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టారు. 1964 నుంచి బడ్జెట్ కు ఒక రోజు ముందు దీనిని ప్రవేశపెడుతున్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశాలు : –
బడ్జెట్ తయారీ ఐదు నెలల ముందుగా తయారు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సర్క్యూలర్లను జారీ చేస్తుంది. ఇందులో అవసరమైన నిధులను సూచించాలని, ఆర్థిక సంవత్సరానికి వారి ఖర్చులను అంచనా వేయాలంటారు. అక్టోబర్ – నవంబర్ మాసాల్లో ఇతర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల అధికారులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహిస్తాయి. ఏ మంత్రిత్వ శాఖ లేదా శాఖకు ఎంత చెల్లించాలనే దానిపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. తర్వాత…బ్లూ ప్రింట్ రెడీ చేస్తారు.

బడ్జెట్ పత్రాల ముద్రణ
బడ్జెట్ పత్రాల ముద్రణ కట్టుదిట్టంగా జరుగుతుంది. కానీ..ఈసారి కరోనా నేపథ్యంలో..బడ్జెట్ లో పత్రాలను ప్రింటింగ్ చేయడం లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో హాల్వా వేడుక జరిగిన అనంతరం…రూపొందించే అధికారులను కేటాయించిన నివాసాలకే పరిమితం చేస్తారు. కనీసం బయటకు పంపకుండా..తగిన సదుపాయాలు కేటాయిస్తారు. బయటివారిని ఎలాంటి
పరిస్థితుల్లో అనుమతించరు. పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పించిన తర్వాతే…అధికారులను బయటకు రావడానికి అనుమతినిస్తారు.

రాష్ట్రపతి ఆమోదం :-
ఇక బడ్జెట్ కు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది. అనంతరం దానిని మంత్రివర్గం ముందు ఉంచుతారు. తర్వాతే..పార్లమెంట్ ఉభయసభలు (లోక్ సభ, రాజ్యసభ) ప్రవేశపెడుతారు. రెండు సభలు ఆమోదించిన తర్వాతే..అమల్లోకి వస్తుంది.