Union Law Ministry: 79 శాతం జడ్జీలు అగ్రకులం వారే.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు లా అండ్ జస్టిస్‌పై ఇచ్చిన ప్రెజెంటేషన్‭పై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం వ్యవస్థ నియమిస్తుందనే విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రభుత్వం కొంత కాలంగా వాదిస్తోంది

Union Law Ministry: 79 శాతం జడ్జీలు అగ్రకులం వారే.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

79% judges appointed to HCs in last 5 years are from upper castes

Union Law Ministry: దేశంలో ఆనాదిగా వేళ్లూనుకుపోయిన సామాజిక సమానత్వం ఇంకా ఇంకా వెనకే ఉంది. అన్ని రంగాల్లో జనాభా ప్రాతినిధ్యం అనేది చాలా ముఖ్యం. కానీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో కూడా ఆ అంతరాలు ఇప్పటికీ పెద్ద స్థాయిలో ఉన్నాయి. తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడించిన వివరాలు ఇందుకు సాక్ష్యం. గత దేళ్ల(2018-2022)లో దేశ వ్యాప్తంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో వెనుకబడిన వర్గాల వారు కనీస ప్రాతినిధ్యంలో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ ఐదేళ్ల నియామకాల్లో 79 శాతం అగ్రవర్ణాల వారే ఉన్నట్లు పార్లమెంటరీ ప్యానెల్ ముందు చేసిన ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

London: నో ప్యాంటు డే.. న్యూయార్క్ నగర వీధుల్లో ప్యాంటు లేకుండా తిరుగుతున్న యువతీయువకులు.. ఇదేం ఈవెంట్రా బాబోయ్..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు లా అండ్ జస్టిస్‌పై ఇచ్చిన ప్రెజెంటేషన్‭పై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం వ్యవస్థ నియమిస్తుందనే విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రభుత్వం కొంత కాలంగా వాదిస్తోంది. ఉప రాష్ట్రపతి జగ్‭దీప్ ధన్‭కర్ సైతం ఈ ప్రస్తావన చేశారు. రాజ్యాంగబద్ధ విభాగమైన న్యాయస్థానాల నియామకాల్లో సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియం ప్రాథమిక బాధ్యతని న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడ్డట్లు సమాచారం.

Bengaluru: రోడ్డుపై కుక్క కనిపిస్తున్నా కారు ఆపని డ్రైవర్.. కారు పైనుంచి వెళ్లడంతో కుక్క మృతి.. కేసు నమోదు

దేశంలోని 25 హైకోర్టుల్లో నియామకాలు ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉండడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 50 శాతం ఉన్న ఓబీసీ వర్గాలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఇదే సమయంలో బిహార్ ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనగణన చేపట్టడం ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నియామకాల్లో ఓబీసీ వాటా 11 శాతమే ఉండడం ఇందుకు కారణం. ఇక ఇదే నియామకాల్లో మైనారిటీలు కేవలం 2.6% మాత్రమే ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సైతం చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. వారి ప్రాధాన్యం వరుసగా 2.8%, 1.3% ఉన్నాయి.