Union Minister Amit Shah: నితీశ్‌కు బీజేపీ తలుపులు మూసుకుపోయాయి.. జేడీ(యు), ఆర్జేడీల కలయికపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.

Union Minister Amit Shah: నితీశ్‌కు బీజేపీ తలుపులు మూసుకుపోయాయి.. జేడీ(యు), ఆర్జేడీల కలయికపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

amit shah

Union Minister Amit Shah: బీహార్ సీఎం, జేడీ(యు) అధినేత నితీశ్ కుమార్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నితీశ్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అన్నారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లోని లౌరియాలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ పై విరుచుకుపడ్డారు. ప్రతీ మూడు సంవత్సరాలకు నితీశ్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీహార్‌లో ఫిరాయింపుదారుల నోరు మెదపాలని అమిత్ షా సూచాంచారు. జై ప్రకాష్ నారాయణ్ కాలం నుంచి కాంగ్రెస్, జంగల్ రాజ్ కు వ్యతిరేకంగా తన జీవితాతం పోరాడిన తరువాత నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ఆయన ప్రధాని కావాలనే ఆశయాలకోసం అభివృద్ధి కారకుడి నుంచి అవకాశవాది అయ్యాడంటూ అమిత్ షా విమర్శించారు.

Union Home Minister Amit Shah: ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో సమూల మార్పులు.. అమిత్ షా కీలక ప్రకటన

ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. నితీష్, లాలూ బీహార్‌ను వెనుకబాటు తనంనుండి అభివృద్ధివైపు నడిపించలేరని అన్నారు. నితీశ్ ప్రధాని కావాలనే ఆశయం బీహార్ ను విభజించిందని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో అరాచకం ఉందని, నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అమిత్ షా ఆర్జేడీ, జేడీ(యూ) కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తుంటే నితీశ్ కుమార్ కళ్లుమూసుకొని కూర్చున్నాడని అన్నారు.

Amit Shah: మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరు.. ఆసక్తికరంగా స్పందించిన అమిత్ షా

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని, జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నితీష్ కుమార్‌ను సీఎంను చేయడం జరిగిందని అమిత్ షా అన్నారు. కానీ నితీష్ మాత్రం మూడేళ్లకోసారి ప్రధాని కావాలనే కలలు కంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని, బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అమిత్ షా చెప్పారు.