తీరంవైపు దూసుకొస్తున్న నిసర్గ తుపాన్

  • Published By: murthy ,Published On : June 1, 2020 / 01:08 PM IST
తీరంవైపు దూసుకొస్తున్న నిసర్గ తుపాన్

ఆరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా, అనంతరం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ఉత్త‌ర మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖఅధికారులు తెలిపారు.  

తుపాను పరిస్ధితిని అంచనా వేయటానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో వివిధ విభాగాల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. NDMA, NDRF, IMD, ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో స‌మావేశ‌మై తుఫాను ప్ర‌స్తుత స్థితి, దాని ప్ర‌భావం, తీసుకోవాల్సిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.  

ఐఎండీ అధికారులు ఈ తుఫానుకు నిస‌ర్గ అని పేరు కూడా పెట్టారు. ఈ నిస‌ర్గ తుఫాను జూన్ 3న తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్ల‌డించ‌డంతో అమిత్‌షా  ఈ సమావేశం నిర్వహించారు.