Minister Anurag Thakur: పాక్ క్రికెట్ బోర్డు‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

వచ్చే ఐసీసీ ప్రపంచ కప్‌లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Minister Anurag Thakur: పాక్ క్రికెట్ బోర్డు‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Anurag Thakur

Minister Anurag Thakur: వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ ప్రపంచకప్‌లో పాల్గొనమంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రకటనపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ప్రపంచ‌కప్‌లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, మీరు ఏ క్రీడలోనైనా భారతదేశాన్ని విస్మరించలేరని పాక్ క్రికెట్ బోర్డుకు కౌంటర్ ఇచ్చారు.

BCCI vs PCB: పాక్‌లో కాకరేపుతున్న బీసీసీఐ నిర్ణయం.. 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తుందా?

క్రికెట్ కు భారత్ అందించిన సేవలను విస్మరించలేమని, వచ్చే ఐసీసీ ప్రపంచ కప్‌లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని  కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశం క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్‌కు చాలా సహకారం అందించింది. కాబట్టి , వచ్చే ఏడాది ప్రపంచకప్ నిర్వహించబడుతుంది. ఇది గొప్ప, చారిత్రాత్మక ఈవెంట్ అవుతుందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ఆసియా కప్ -2023 టోర్నీకి భారత్ జట్టు వెళ్లకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా పాకిస్తాన్‌లో భద్రతా సమస్యలన్నారు. భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్రికెట్‌ మాత్రమే కాదు, ఇండియా ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదని మంత్రి ఠాకూర్‌ అన్నారు.