ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి సదానందగౌడ

ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి సదానందగౌడ

Union minister D V Sadananda Gowda hospitalised in Chitradurga కేంద్రమంత్రి,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(జనవరి-3,2021) ఉదయం శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమానికి సదానంద గౌడ హాజరయ్యారు. అనంతరం బెంగళూరుకి తిరుగుపయనమయ్యారు. అయితే మధ్యాహ్నాం కావడంతో 1:45గంటల సమయంలో మార్గమధ్యంలో చిత్రదుర్గలోని ఓ హాటల్ దగ్గర ఆగారు. హాటల్ వద్దకు చేరుకున్న సదానందగౌడని పార్టీ నాయకులు,మద్దతుదారులు గ్రీట్ చేశారు.

అయితే హోటల్ లోకి ప్రవేశించి సమయంలో ఒక్కసారిగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. షుగర్ లెవల్స్ తగ్గిపోవడంతో కారు పక్కనే పడిపోయారు. దీంతో వెంటనే ఆయనని పోలీసు వాహనంలో దగ్గర్లోని బసవేశ్వర మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ పడిపోయారని తెలిసిన వెంటనే బీజేపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయనని పరామర్శించారు. సదానంద గౌడకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఓ మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని,కుటుంబసభ్యులు,పార్టీ నాయకులతో కూడా మాట్లాడారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆయన షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాయని చెప్పారు. పరిస్థితి మెరుగైన తర్వాత 3గంటల సమయంలో సదానందగౌడని అంబులెన్స్ లో చిత్రదుర్గ నుంచి బెంగళూరులోని ఎస్తర్ సీఎమ్ఐ హాస్పిటల్ కి తరలించారు.

లంచ్ ఆలస్యం కావడంతో సదానందగౌడకి షుగర్ లెవల్స్ పడిపోయాయని…ఆయన డయాబెటిక్ పేషెంట్ అని..ఒక గంట పాటు లంచ్ ఆలస్యం అయిందని..దీంతో షుగర్ లెవల్స్ పడిపోయి ఆయన పడిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.