Union Minister Dharmendra Pradhan : కొటియా గ్రామాలు ఒడిశావే.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు

ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటాయి. అయితే ఈ గ్రామాలు ఇటు ఆంధ్రావా? అటు ఒడిశావా? అనే వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.

Union Minister Dharmendra Pradhan : కొటియా గ్రామాలు ఒడిశావే.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు

Dharmendra Pradhan

Union Minister Dharmendra Pradhan : కొటియా గ్రామాలపై కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొటియా గ్రామాలు ఒడిశావేనని ఆయన తేల్చి చెప్పారు. కొటియా గ్రామాల్లో ధర్మేంద్రప్రధాన్ పర్యటించారు. ధర్మేంద్రప్రధాన్ ను కొటియా సీఐ రోహిణి పాత్రో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆంధ్ర పోలీసులకు ఇక్కడేం పని..గో బ్యాక్ ఆంధ్ర అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొటియాలో గ్రామాలు 21 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటాయి. అయితే ఈ గ్రామాలు ఇటు ఆంధ్రావా? అటు ఒడిశావా? అనే వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అయితే ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో కొటియాలో వేడుకలు జరుగుతున్నాయి. వేడకల్లో పాల్గొనేందుకు అక్కడికి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ వచ్చారు. బీజేపీ కార్యకర్తలతోపాటు ఆయన పలు గ్రామాలను సందర్శించారు. ఆంధ్రకు చెందిన కొటియా సీఐ రోహిణి పాత్రో పోలీసు బలగాలతో ధర్మేంద్రప్రధాన్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు అక్కడికి వెళ్లారు.

Sharath Chandra Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

ఉన్నట్టుండి ధర్మేంద్రప్రధాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్ర పోలీసులకు ఇక్కడేం పని.. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటూ తీవ్ర పదజాలంతో స్పందించారు. ఈ కొటియా గ్రామాలన్నీ ఒడిశా పరిధిలోకి వస్తాయని, ఇవి ఒడిశా గ్రామాలని ఆయనపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. దీంతో సీఐ రోహిణి పాత్రలో అక్కడి నుంచి వెనుదిరిగారు.

అయితే ప్రస్తుతం ధర్మేంద్రప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు కొటియా గ్రామాల వివాదం సుప్రీంకోర్టులో ఉంది. కొటియా గ్రామాలు ఆంధ్రావా? ఒడిశావా అనేది తేలలేదు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పదవిలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కొటియా గ్రామాలు ఒడిశావే అని చెప్పడం కలకలం రేపుంతోంది.