క్రిష్టియన్ స్కూల్స్‌‌పై కేంద్రమంత్రి వ్యాఖ్యలు: భారత సంస్కృతీ తెలీదు..గొడ్డు మాంసం తింటారు..

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 10:53 AM IST
క్రిష్టియన్ స్కూల్స్‌‌పై కేంద్రమంత్రి వ్యాఖ్యలు: భారత సంస్కృతీ తెలీదు..గొడ్డు మాంసం తింటారు..

క్రిష్టియన్ స్కూల్స్ పనితీరుపై కేంద్రమంత్రి గిరిజార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివిన పిల్లలు డీఎం, ఎస్పీ, ఇంజినీర్లు అవుతున్నారని, వాళ్లు విదేశాలకు వెళ్లినపుడు గో మాంసాన్ని తింటున్నారని..ఈ స్కూల్స్ లో చదివినవారికి భారత సంస్కృతీ సంప్రదాయాలు తెలీవని అన్నారు. ఆ రకమైన టీచింగ్ ఆ స్కూల్స్ లో ఉండదని..వారికి భారత దేశపు సంస్కృతిని వారికి నేర్పించలేదు..హిందూ సంప్రదాయ విలువలు వారికి అందటం లేదన్నారు. 

భారతదేశాన్ని కాపాడటానికి భారతదేశ సంస్కృతిని కాపాడవలసిన ​​అవసరం ఉందని సింగ్ అన్నారు. బాల్యం నుంచే విద్యార్థులతో భగవద్గీతను బోధించాలనీ.. హనుమాన్ చలీసా, రామాయణం. భగవద్గీతలోని  శ్లోకాలను నేర్పించాలని వారితో చక్కగా గీతా శ్లోకాలు చదివించాలనీ వాటిని కంఠతా పట్టించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. 

బీహార్‌లోని బేగుసారైలో బుధవారం జరిగిన శ్రీమద్ భగవత్ కథ గ్యపాన్ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి, మత్స్యశాఖ మంత్రి ప్రసంగంటో మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకీ దేశంలో ధర్మం, సహనం నిలిచివున్న కారణంగానే ప్రజాస్వామ్యం బతికి ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులు చేత గీతా పఠనం చేయించాలని, పాఠశాల ప్రాంగణంలో ఆలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.