Ayush Medicines : 64 ఆయుష్ మెడిసిన్స్ విడుదల చేసిన మంత్రి కిషన్ రెడ్డి

కరోనా బాధితుల కోసం కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆయుష్ మందులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఆయుష్ డిపార్ట్ మెంట్ లకు పెద్ద పీట వేశారని..ఆయుర్వేద మందుల తయారీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టీవీ పెడితే ఆయుర్వేద మందులనుతయారు చేసిన ఆనందయ్య పేరే వినిపిస్తోందని..ఆయుర్వేద మందులపై ప్రజలకు ఉన్న నమ్మకమేనని అన్నారు.

Ayush Medicines : 64 ఆయుష్ మెడిసిన్స్ విడుదల  చేసిన మంత్రి కిషన్ రెడ్డి

Ayush Medicines

64 types of AYUSH medicines launched : కరోనా బాధితుల కోసం కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆయుష్ మందులను విడుదల చేశారు. కరోనాను తగ్గించే 64 రకాల మందులను మంత్రి విడుదల చేశారు. వాటిని సేవా భారతి ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఆయుష్ డిపార్ట్ మెంట్ లకు పెద్ద పీట వేశారని..ఆయుర్వేద మందుల తయారీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టీవీ పెడితే ఆయుర్వేద మందులనుతయారు చేసిన ఆనందయ్య పేరే వినిపిస్తోందని..ఆయుర్వేద మందులపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఆనందయ్య పేరు మారుమ్రోగేలా చేస్తోందని అన్నారు. ఆయుష్ మందుల కోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారని గుర్తు చేశారు.

కాగా..ఏపీలో ఇటీవల కాలంలో ఆనందయ్య ఇచ్చే మందు కరోనాను కట్టడి చేస్తోందనీ..వెంటిలేటర్ పై ఉండే రోగులు కూడా ఆనందయ్య చేతి మందు వేయించుకుని ఆరోగ్యవంతులయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో ఎంతోమంది ప్రజలు హాస్పిటల్ నుంచి ఆనందయ్య మందు కోసం భారీగా నెల్లూరు లోని కృష్ణపట్నం తరలివెళ్లారు. ఈక్రమంలో ఆనందయ్య మందు వివాదంగా మారింది. దీనిపై ఓ ఆయుష్ ప్రతినిధులు పరీక్షలు చేయటం అనంతరం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగింది. దీంతో ఆనందయ్య మందు కరోనా రోగులకు పంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఈక్రమంలో వైపీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..ఆనందయ్య ముందు కోసం ఎవరు కూడా నెల్లూరు జిల్లాకి రావలసిన అవసరం లేదనీ..అన్ని ప్రాంతాల్లో కి మందు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేవలం ఇది ఏపీ రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాలకు మందు అవసరం అయితే వాళ్లకు చేరవేసే అన్ని మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు అలాగే కొరియర్లు, ఆన్లైన్ ద్వారా ఈ ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మందు తయారీ విధానాన్ని వికేంద్రీకరణ చేసి మందు తయారు చేసే అవకాశాలు కూడా ఆలోచిస్తున్నామనీ..ముందుగా నెల్లూరు జిల్లావాసులకు ..ఆ తరవాత రాష్ట్ర వ్యాప్తంగానూ ఆ తరువాత అవసరాన్ని బట్టి దేశమంతా ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని తెలిపారు.