Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రెండోసారి బెదిరింపు కాల్

నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో మహారాష్ట్రలోని ఆయన నివాసానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు.

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రెండోసారి బెదిరింపు కాల్

Nitin Gadkari

Threat Call: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం ఢిల్లీలోని తన నివాసానికి ఫోన్ కాల్ ద్వారా హత్యా బెదిరింపు వచ్చింది. ఈ విషయమై మంత్రి కార్యాలయం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ విషయం విచారణలో ఉందని మంగళవారం పోలీసులు వర్గాలు వెల్లడించాయి. హత్యా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు మంత్రి సిబ్బంది నుంచి సమాచారం అందిందని, ప్రస్తుతం ఆ వివరాలను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Karnataka CM: సిద్ధూ కాదు డీకే కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తి?

నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో మహారాష్ట్రలోని ఆయన నివాసానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. ‘‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని జైలు నుంచి బెదిరిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, హత్య నిందితుడు. బెలగావి జైలులో ఖైదీ అయిన జయేష్ కాంత. జైలులో అక్రమంగా ఫోన్‌ని ఉపయోగించి గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ చేశాడు’’ అని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Karnataka CM: ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంను ఎంపిక చేయడమే కష్టమైంది.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న గత అనుభవాలు