చైనా ఫుడ్ ను బహిష్కరించాలి..ఆ రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి : కేంద్రమంత్రి పిలుపు

  • Published By: nagamani ,Published On : June 19, 2020 / 07:54 AM IST
చైనా ఫుడ్ ను బహిష్కరించాలి..ఆ రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి : కేంద్రమంత్రి పిలుపు

చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ప్రజలు చైనీస్ ఫుడ్‌ని పూర్తిగా బహిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. ఇండియా-చైనా సరిహద్దు వివాదంలో గాల్వాన్ లోయలో ఇండియా సైనికులపై చైనా జరిపిన మరణకాండకు వ్యతిరేకంగా చైనా వస్తువులకు బహిష్కించాలనీ..చైనా ఫుడ్ ను దేశంలో నిషేధించాలని పిలుపునిచ్చారు.

ఇండియాపై చైనా దురుద్ధేశానికి చేస్తున్న అఘాయిత్యాలకు దేశంలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. చైనా వస్తువులను ధ్వంసం చేస్తూ..కొందరు..చైనా అధ్యక్షుడు బొమ్మకు అత్యక్రియలు చేస్తు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.చైనాపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.  

ఈక్రమంలో చైనా కుటిల బుద్దిపై భారత్ ఎప్పటికప్పుడు ఎంతో సమన్వయంతో వ్యవహరించినా  చైనా వ్యవహారం ఎంతకూ మారటంలేదు. అదను చూసి భారత్ సైన్యంపై విరుచుకుపడి 20మంది భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకుంది డ్రాగన్ దేశం. 

దీంతో చైనాకు ఆర్థికంగా బుద్ధి చెప్పాలనే ముఖ్యంగా చైనాతో భారత్ ఆర్థిక లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే భారత్ యోచిస్తోంది. చైనా వస్తువులను, చైనా యాప్స్‌ను బహిష్కరించాలని భారతీయులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ప్రజలు చైనీస్ ఫుడ్‌ని పూర్తిగా బహిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. 

దేశంలో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని, చైనా యాప్స్‌ను నిషేదించాలనే డిమాండ్లు పెరగడంతో.. ఇప్పటికే అనేకమంది మొబైల్ ఫోన్లలో చైనాకు చెందిన 51 యాప్స్‌ను డిలీట్ చేస్తున్నారు. మరోవైపు పలు చోట్ల ప్రజలు చైనా ఉత్పత్తులను పగలగొట్టేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. 

ఇదిలావుండగా టెలికాం మంత్రిత్వ శాఖ.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలను అప్‌గ్రేడేషన్‌లో చైనా పరికరాలను వాడవద్దని కోరింది. ‘మేడ్ ఇన్ ఇండియా‘ ఉత్పత్తులకు తమ కొనుగోళ్లను పరిమితం చేయాలని తెలిపింది. దీంతో బీఎస్ఎన్ఎల్ 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించింది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా నడిచే అవకాశం కనిపిస్తోంది.

కాగా, గాల్వాన్‌లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా..వారికి దేశం యావత్తు హృదయపూర్వకం ఘన నివాళులు అర్పిస్తోంది. వీరులారా వందనం..మీ త్యాగాలు వృథాకానివ్వం అంటూ భారతీయులంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. భారత సైన్యం 20మంది చనిపోగా..35 నుంచి 43 మంది వరకు చైనా సైనికులు మరణించినట్టుగా తెలుస్తోంది. కానీ చైనా మాత్రం ఈ లెక్కలను బైటకురానివ్వటంలేదు. ఎంతైనా కుటిల బుద్ది కదా.

Read: కుటుంబం ఆకలి తీర్చటానికి ‘కరోనా’మృతదేహాలను మోస్తున్న బాలుడు