Union Minister Jaishankar: 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్

2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.

Union Minister Jaishankar: 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్

Union Minister Jaishankar

Union Minister Jaishankar: 2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. తమిళ వార పత్రిక తుగ్లక్ పత్రిక 53వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానం, కరోనా మహమ్మారిని ఇండియా ఎలా ఎదుర్కొంది, ఎల్‌ఏసీపై చైనా ఆక్రమణను భారత్ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశాలపై జైశంకర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆర్థిక విషయాల్లో భారతదేశం అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, ఈ దశాబ్దం చివరి నాటికి మూడవ స్థానంకు చేరుకుంటుందని తెలిపారు.

Minister Jaishankar: హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలు గుర్తు‌చేస్తూ.. పాక్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి జైశంకర్

దేశ భద్రతకు అన్ని విధాల కృషిచేస్తామని అన్నారు. పాకిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందించడంతో పాటు చైనాకు సరిహద్దుల్లో సరియైన గుణపాఠం చెప్పడం జరుగుతుందని కేంద్ర మంత్రి అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా వైమానిక దళం నిర్వహించిన బాలాకోట్ వైమానిక దాడులు చాలా వసరమైన సందేశాన్ని పంపాయని 2019లో జరిగిన ఘటన గురించి కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ఉత్తర సరిహద్దుల్లో చైనా భారీగా బలగాలను మోహరించి, సరిహద్దు నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ -19సమయంలోనూ సరిహద్దుల్లో చైనా కుట్రలకు భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని అన్నారు.

 

భారతదేశం ఎవరి బలవంతంలేని దేశం, దాని భద్రతను నిర్ధారించడానికి అది ప్రతిదీ చేస్తుందని జైశంకర్ అన్నారు. సరిహద్దుల్లో మోహరించిన భారత బలగాలు అత్యంత కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నా భద్రత విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని అన్నారు. భారతదేశం ప్రతీ కష్టాన్ని ధృడంగా ఎదుర్కొంటుందని ప్రపంచం చూసిందని అన్నారు. కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను విజయవంతంగా అందించిన ఘనత భారత్ దేశానిదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.