Minister Smriti Irani : ‘పశువుల పాకలో జీవించాం’ కుంగుబాటు నుంచి కేంద్రమంత్రిగా.. వ్యక్తిగత వివరాలు వెల్లడించిన స్మృతి ఇరానీ

మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొన్నారు. అన్నింటిని తట్టుకుని నిలదొక్కుకుని కేంద్రమంత్రి అయ్యారు. ఇలా ఆమె జీవితంలో జరిగిన పలు సమస్యలను..వ్యక్తిత జీవితం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు స్మృతి ఇరానీ.

Minister  Smriti Irani : మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొన్నారు. అన్నింటిని తట్టుకుని నిలదొక్కుకుని కేంద్రమంత్రి అయ్యారు. ఇలా ఆమె జీవితంలో జరిగిన పలు సమస్యలను..వ్యక్తిత జీవితం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు స్మృతి ఇరానీ. నా తండ్రి పంజాబీ ఖాత్రి. అమ్మ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కాబట్టి వారిద్దరు ఇంట్లో తాతయ్యకు ఇష్టంలేకుండా వివాహం చేసుకున్నారు. వివాహం అయ్యాక వారి సంపాదన రూ.150లు. నా నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ మా అమ్మ డిగ్రీ చదువుకుంది.

నాన్న ఒక ఆర్మీ క్లబ్‌ ముందు పుస్తకాలు అమ్మేవారు. నేను నాన్న వద్దే కూర్చునేదాన్ని కుటుంబం గడవటానికి మా అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలు దినుసులు అమ్మేవారు. మేము ఓపశువుల (ఆవుల కొట్టం) పాకలో ఉన్న పైన గదిలో నివసించేవాళ్లం. నేను లేడీ హార్డింజ్ హాస్పిటల్ లో పుట్టానట. ఆ తరువాత కూడా వారి సంపాదన పెరగకపోవటంతో గుర్గావ్ కు మారిపోయారు. నా చిన్నతనంలో చాలా ఆర్థిక కష్టాలు అనుభవించాం. చాలామంది మమ్మల్ని చులకనగా చూసేవారు. వారిద్దరి మధ్యా అభిప్రాయబేధాలుండేవి. తరచు పోట్లాటలు జరిగేవి.

అలా కొన్నాళ్లకు నా తల్లిదండ్రులు విడిపోయారు.నా తల్లిదండ్రులు విడిపోయిన విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లుపట్టింది. చేతిలో రూ.100తో ఓ కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. ఒక గోవుల కొట్టంలో ఉంటూ..చేతిలో నిత్యావసరాలు తీర్చుకునే ఆర్థిక స్తోమత కూడ లేకుండా ఉంటే ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరు’ అంటూ చెప్పుకొచ్చారు.

గుర్గావ్ లో మేం ఉండే మొదటి ఇల్లు నాకు ఇప్పటికీ గుర్తే..దుమ్ము పట్టి చిన్నగా ఇరుకుగా ఉండేది. ఇల్లు శుభ్రం చేసే పని నాది. అప్పుడు నాకు ఏడేళ్లు. ఆ ఇల్లు నా చివరి జ్ఞాపకంగా ఫోటోకూడా నా దగ్గర ఉంది..నేను తెల్లటి గౌను..క్యాప్ ధరించి ఉన్నాను అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత 40 సంవత్సరాల వయస్సులో నేను పుట్టిన రోజు జరుపుకున్నానని తెలిపారు స్మృతి. నేను 37 ఏళ్ల వయస్సులో ఎంపీ అయ్యాక మేము చిన్నప్పుడు ఉండే ఆ చిన్న ఇంటికి వెళ్లాను నా భర్తతో కలిసి. ఇదే మేము అప్పుడు జీవించిన ఇల్లు అని చూపించానని తెలిపారు. మా అమ్మ ఎక్కువ సమయం అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఏడేళ్ల క్రితం నేను ఒక ఇంటిని కొనిచ్చాను. ఆ ఇంటికి మా అమ్మ అద్దె చెల్లించేవారు..కుమార్తెల నుంచి ఏదీ తీసుకోవటం ఆమెకు ఇష్టం ఉండదు..అంత ఆత్మాభిమానం గల మహిళ మా అమ్మ అంటూ గర్వంగా చెప్పారు.

రాజకీయాల్లోకి రాకముందు నటిగా పనిచేస్తున్న సమయంలో ఎదుర్కొన్న సమస్యలను స్మృతి వెల్లడించారు. నటిగా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’,‘రామాయణ్‌’ అంటూ ఆ రోజులను నెమరువేసుకున్నారు. ఆ సీరియల్స్ లో నటిస్తున్న రోజుల్లోనే నాకు అబార్షన్ అయ్యిందని తెలిపారు. ఆ ఘటనతో ఎంతో కృంగిపోయాను. దానుంచి బయటపడలేకపోయాను. కానీ షూటింగ్స్ బిజీ..గ్యాప్ తీసుకుందామనుకున్నా..కానీ ఇంటి కోసం తీసుకున్న లోన్ ఈఎంఐలు, ఇతర ఖర్చులు ఆ అవకాశం ఇవ్వలేదు. అలా జీవితంలో ఎన్నో ఒడిదుడులను తట్టుకుని ప్రస్తుతం ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటూ ఎన్నో వ్యక్తిగత జీవిత అంశాలను వెల్లడించారు కేంద్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.

స్మృతి చిన్నప్పటి నుంచే ఆరెస్సెస్ సభ్యురాలు. బ్రతుకు తెరువు కోసం ఆమె ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఎంత చిన్నపని అయినా చేయటానికి వెనుకాడేవారు కాదు. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నటిగా మారారు. నిర్మాతగా ఉన్నతస్థాయిలో ఉన్నపుడే రాజకీయరంగంలోకి అడుగుపెట్టి.. 2003 లో బిజెపిలో చేరారు. 2004 ఎన్నికల్లో ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ బీజేపీకి ఓటు బ్యాంకు సంపాదించారు. అలా కొన్నాళ్ళకు బిజెపి జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా కార్యదర్శిగా, బీజేపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగి..2014 లో మోదీ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యారు. తరువాత స్త్రీ సంక్షేమ శాఖామంత్రిగా ఉన్నారు.

 

 


 

 

 

ట్రెండింగ్ వార్తలు