Rahul Gandhi: వయనాడ్‭లోనే ఉంటే అదే గతి పడుతుంది.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ స్మృతి ఇరానీ

ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్‌వాడీలను 'సాక్షం' (సామర్థ్యం గల) అంగన్‌వాడీలుగా మార్చాలని నిర్ణయించుకున్నానని తెలిపారు

Rahul Gandhi: వయనాడ్‭లోనే ఉంటే అదే గతి పడుతుంది.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ స్మృతి ఇరానీ

Smriti Irani: కాంగ్రెస్‌ కీలక రాహుల్‌ గాంధీ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వయనాడ్‌లో ఉండిపోతే ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ఎంపీగా ఉన్న సమయంలో పట్టిన గతే పడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అమేథీ నుంచి రాహుల్ పలుమార్లు ఎంపీగా గెలిచారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థానంలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే అదే సమయంలో కేరళ రాష్ట్రాంలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ తిరుగులేని మెజారిటీతో గెలిచారు.

Whatsapp Message : ఆఫ్రికాలో తండ్రి.. తెలంగాణలో కూతురు.. ఇద్దర్నీ కలిపిన వాట్సాప్ మెసేజ్

ఇక తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కేరళ యూనిట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా కార్మిక సదస్సును శ్రీమతి ఇరానీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీని అమేథీ నుంచి పంపిన వ్యక్తిగా తనకు అదృష్టం కలిగిందని అన్నారు. ‘‘రాహుల్ అమేథీ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడి ప్రజల్లో 80 శాతం మందికి విద్యుత్ కనెక్షన్లు లేవు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదు. అగ్నిమాపక కేంద్రం లేదు. వైద్య కళాశాల లేదు. కేంద్రీయ విద్యాలయం లేదు. సైనిక్ స్కూల్ లేదు. జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, ఎక్స్-రే వంటి సౌకర్యాలు లేవు. ఆయన వెళ్ళిన తర్వాత, ఈ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నీ వచ్చాయి’’ అని ఆమె అన్నారు.

Australia Event: క్రికెట్ కలిపింది ఇద్దరినీ.. ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ

రాహుల్ గాంధీ వల్ల వయనాడ్ సైతం అమేథీలా మారుతుందని.. ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్‌వాడీలను ‘సాక్షం’ (సామర్థ్యం గల) అంగన్‌వాడీలుగా మార్చాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సాక్షం అంగన్‌వాడీ అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. దీని కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అంగన్‌వాడీలకు పోషకాహారం, ప్రీ-స్కూల్ నాన్‌ఫార్మల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్, రిఫరల్ సర్వీసెస్ అనే ఆరు సేవల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

Telangana : CM కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల మాటల తూటాలు .. ఘాటు విమర్శలతో రెచ్చిపోయిన YSRTP అధ్యక్షురాలు

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపిగా అనర్హులయ్యారు. క్రిమినల్ కేసులో ఆయనను గుజరాత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్లపాటు శిక్ష విధించింది. అనంతరం కోర్టు ఆదేశాలను అనుసరించి పార్లమెంట్ సెక్రెటేరియట్ అనర్హుడిగా ప్రకటించింది. అయితే కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై గుజరాత్‌ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.