Smriti Irani : “మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి’’

చింపిరి జుట్టుతో..చినిగిన బట్టలతో..చీపురు చేత పట్టుకుని పనిచేసే ఓ చిన్నపాప స్కూలుకు వెళితే ఎలా ఉంటుంది. ఆ పాప ముఖంలో వెలసిన చిరునవ్వు..అప్పటి వరకు కష్టాలు తప్ప సంతోషం అంటే ఏంటో తెలియని ఆ చిట్టిపాప అందమైన సీతాకోక చిలుకలా మారితే ఎలా ఉంటుంది..అనే ఓ అందమైన ఆలోచింపజేసే ఓ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టాలో షేర్ చేశారు.

Smriti Irani : “మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి’’

Smriti Irani Posts Video A Powerful Message

Smriti Irani posts video a powerful message : చింపిరి జుట్టుతో..చినిగిన బట్టలతో..చీపురు చేత పట్టుకుని పనిచేసే ఓ చిన్నపాప స్కూలుకు వెళితే ఎలా ఉంటుంది. ఆ పాప ముఖంలో వెలసిన చిరునవ్వు..అప్పటి వరకు కష్టాలు తప్ప సంతోషం అంటే ఏంటో తెలియని ఆ చిట్టిపాప అందమైన సీతాకోక చిలుకలా మారితే ఎలా ఉంటుంది..అనే ఓ అందమైన ఆలోచింపజేసే ఓ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. భారతదేశంలో ఎంతోమంది చిట్టితల్లుల దీన పరిస్థితిని ఈ వీడియోలో కనిపిస్తుంది. చాలామంది పిల్లల్లా స్కూలుకు వెళ్లి చదువుకోవాలని కలలు కనే నిరుపేద పిల్లలకు అద్ధం పడుతోంది ఈ వీడియో. చక్కటి మెసేజ్ ను ఇస్తోందీ వీడియో.

ఒక చిన్న పాకు సంబంధించిన యానిమేటెడ్ వీడియో ఆలోచింపజేసే ఈ వీడియోను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలు ఒక చిన్న పాప.. విచారకరమైన ముఖంతో చేతిలో చీపురుతో నిలబడి ఉంటుంది. ఆ పాప కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటాయి. అలా విచారంగా ఉన్న ఆ చిన్నారికి ఓదార్పునిస్తూ..భరోసానిస్తుంది ఓ ఆపన్న హస్తం.

ఓ దువ్వెన్నతో ఆ పాప చింకిజుట్టును చక్కగా దువ్వుతుంది. చిన్న చేతిరుమాలుతో కన్నీళ్లు తుడుస్తుంది. బుక్స్ చేతికిచ్చి..చిరిగిన దుస్తుల్ని స్కూల్ యూనిఫాలా మార్చేస్తుంది. అంతే ఆ వెంటే ఆ చిన్నారి మొఖంలో చిరునవ్వు వెలుస్తుంది. సంతోషంగా ఆ చిట్టిపాప మోము వెలిగిపోతుంది. అప్పటి వరకూ కష్టాలకు ప్రతిరూపంగా ఉన్న ఆ చిన్నారి అందమైన సీతాకోక చిలుకలా రెక్కలు విప్పుకుంటుంది. ”స్మృతి ఇరానీ వీడియోను షేర్ చేస్తూ..“మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి’’ అంటూ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ అంటూ మణిరత్నం సినిమాలోని రోజా సినిమాలో పాటను జోడించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 135 కి పైగా చూశారు.

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial)