Smriti Irani : స్మృతీ ఈజ్ బ్యాక్..బరువు తగ్గిపోయిన మంత్రి స్మృతీ ఇరానీ..

టీవీ నటిగా తన కెరీర్ మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్న స్మృతీ ఇరానీ బాగా బరువు తగ్గి కనిపించటంలో అభిమానులంతా స్మతి ఈజ్ బ్యాక్ అంటున్నారు.

Smriti Irani : స్మృతీ ఈజ్ బ్యాక్..బరువు తగ్గిపోయిన మంత్రి స్మృతీ ఇరానీ..

Smriti Irani Undergoes A Massive Weight Loss

Smriti Irani undergoes a massive weight loss : టీవీ నటిగా తన కెరీర్ మొదలుపెట్టిన కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు స్మృతీ ఇరానీ. టీవీ నటిగా ఎంతోమంది హృదయాలు దోచుకున్న స్మృతీ బాగా బరువు పెరిగారు. కానీ బరువు తగ్గే యత్నాలు చేసి చక్కటి ఫలితాలు పొందిన స్మృతీని ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అలనాటి స్మృతీని గుర్తు చేసేలా ఉన్నారిప్పుడు ఆమె. టీవీ నటిగా ఉన్నప్పుడు ఆమెకు ఎంతమంది అభిమానులు ఆదరించేవారో కేంద్ర మంత్రి పదవి స్థాయికి చేరుకున్నా ఇప్పటికీ అంతే ఆదరణ ఉందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో స్మృతీ చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.ఎప్పటికప్పుడు సరికొత్తగా..వినూత్నంగా పోస్టులు పెట్టే ఆమెకు చాలామంది ఫాలోవర్స్ ని ఉన్నారు. తన ఫాలోవర్స్ ని స్మృతీ చైతన్యపరుస్తూ ఉంటారు.

ఈక్రమంలో తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో.. మాస్క్ పెట్టుకోవడం ఎంత అవసరమో తెలియజేస్తూ.. ఓ పోస్టు షేర్ చేశారు.ఆ ఫోటోలు చూసి ఆమె అభిమానులంతా షాకౌతున్నారు. ఎందుకంటే.. ఆ ఫోటోల్లో స్మృతీ గతంలో కంటే బాగా బరువు తగ్గి కనిపిస్తున్నారు.ఆమె వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అవుతున్నారు. అలనాటి స్మృతీని గుర్తు తెచ్చేలా ఉన్నారే అంటున్నారు. బరువు తగ్గిన తర్వాత.. స్మృతి ఇరానీ తన పాత లుక్ లోకి వచ్చేశారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

కొందరేమో.. వాట్ లే ట్రాన్స్ ఫర్మేషన్ మేడమ్.. ఇన్ స్పైరింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. స్మృతి ఇరానీ 2000 లో ‘ఆతిష్’, ‘హమ్ హే కల్ ఆజ్ అవుర్ కల్’ సీరియల్స్ తో టెలివిజన్‌లో అడుగుపెట్టి ఎంతోమంది మనస్సుల్ని గెలుచుకున్నారు. దూరదర్శన్ మెట్రో ‘కవిత’లో కూడా కనిపించారు. ఆమె 2001 లో జీ టీవీ రామాయణంలో సీత దేవి పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

కానీ ఏక్తా కపూర్ రాసిన బాలాజీ టెలిఫిల్మ్స్ టీవీ సబ్బు ‘క్యుంకి సాస్ భీ కభీ బహు థీ’తో స్మృతికి బాగాపేరు వచ్చింది. ఆ సీరియల్ లో ఆమె తులసి పాత్రలో ఒదిగిపోయారు. ఆ తులసి పాత్ర అంటే ఆమె అభిమానులకు ఎంతో ఇష్టం.తులసి పాత్ర స్మృతీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. నాలుగు ఇండియన్ టెలీ అవార్డులు కూడా గెలుచుకున్నారు. అలా బుల్లితెర నటి కాస్తా నేడుకేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు స్మృతీ ఇరానీ.