సాగు చట్టాలపై పవార్-తోమర్ మధ్య ట్వీట్ వార్

సాగు చట్టాలపై పవార్-తోమర్ మధ్య ట్వీట్ వార్

farm laws ఎన్సీపీ అధినే శరద్​ పవార్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య ​మాటల యుద్ధం నడుస్తోంది. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన తోమర్‌ వ్యాఖ్యలను కౌంటర్‌ చేస్తూ శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సరైన వాస్తవాలను తోమర్ వెలుగులోకి తీసుకురావడం లేదని పవార్ ఆరోపించారు.

కాగా, వ్యవసాయ చట్టాలను విమర్శిస్తూ తొలుత శనివారం శరద్ పవార్​ ట్వీట్​ చేయగా.. వాటిని తోమర్​ తప్పుబట్టారు. పవార్​ చేసిన ట్వీట్లు చట్టంలో ఉన్న వాస్తవాలను ప్రతిబింబించేలా లేవని మండిపడ్డారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నపవార్.. వారిని పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని తోమర్ హితవు పలికారు. ప్రతిగా.. పవార్​ మళ్లీ తోమర్​ వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చారు.

కొత్త చట్టాలు.. వ్యవసాయ మార్కెట్లను ప్రభావితం చేయవని మంత్రి హామీ ఇస్తున్నప్పటికీ రైతు సంఘాల దృష్టిలో చట్టంలోని నిబంధనలు కార్పొరెట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కొత్త చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ వెలుపల అమ్ముకోవచ్చు కానీ తమ ఉత్పత్తులను ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించేటప్పుడు కనీస మద్ధతు ధరకు రక్షణ ఉండదని వివరించారు. ఆందోళన చేస్తున్న రైతులు మొదటి నుంచి చెబుతున్నది ఇదేనని ట్వీట్‌ లో పవార్ తెలిపారు.

కాగా, వ్యవసాయ చట్టాలను విమర్శిస్తూ తొలుత శనివారం శరద్ పవార్​ ట్వీట్​ చేయగా.. వాటిని తోమర్​ తప్పుబట్టారు. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. ప్రతిగా.. పవార్​ మళ్లీ తోమర్​ వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చారు. వ్యవసాయ బిల్లుపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం లేదని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుపై సరైన వాస్తవాలను తోమర్ వెలుగులోకి తీసుకురావడం లేదని ఆరోపించారు.