Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రా…విచారణకు హాజరవుతారా ?

ఆశిష్‌ మిశ్రా ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తెలిపారు.

Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రా…విచారణకు హాజరవుతారా ?

Up

Union minister’s son Ashish Mishra : ఆశిష్‌ మిశ్రా ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చారు. తన కుమారుడికి పోలీసులు గురువారం సమన్లు ఇచ్చారని, అయితే ఆరోగ్య కారణాల వల్ల పోలీసుల ఎదుటకు శుక్రవారం రిపోర్ట్‌ చేయలేకపోయినట్లు అజయ్‌ మిశ్రా చెప్పారు. తన కుమారుడు పోలీసులకు 2021, అక్టోబర్ 09వ తేదీ శనివారం రిపోర్ట్‌ చేస్తాడన్నారు.

Read More : SC Railway : పండగ బాదుడు.. పెరిగిన రైలు చార్జీలు

తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తాడని అజయ్‌ మిశ్రా తెలిపారు. ప్రతిపక్షం ప్రతి అంశంపై తన రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నదని మండిపడ్డారు. దర్యాప్తు మొదలైతే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు అజయ్‌ మిశ్రా. లఖింపూర్‌ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లడంతో 8 మంది మరణించారు. అయితే అందుకు కారణం ఆశిష్ మిశ్రా అని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Read More : Whale Vomit: తిమింగళం 30కిలోల వాంతి.. రూ.10కోట్లు వచ్చిపడ్డాయ్!!

దీంతో యూపీ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఆయన హాజరుకాకపోవడంతో రెండోసారి సమన్లు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్‌ కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు.