Congress in Exam: కాంగ్రెస్‌ను కీర్తిస్తు 12వ తరగతి పేపర్‌: రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరిన కేంద్రం

రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, ఆపార్టీ విజయాలను, గత చరిత్రలను కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ ఆరు ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇచ్చారు.

Congress in Exam: కాంగ్రెస్‌ను కీర్తిస్తు 12వ తరగతి పేపర్‌: రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరిన కేంద్రం

Exam Paper

Congress in Exam: 12వ తరగతి పరీక్షలో ఒక రాజకీయ పార్టీని కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ వచ్చిన ప్రశ్నలను చూసి విద్యార్థులు సహా..స్థానిక నేతలు అవాక్కయ్యారు. ఈఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్షల్లో బుధవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలో వచ్చిన కొన్ని వింత ప్రశ్నలు విద్యార్థులను కొంత విస్మయానికి గురిచేసింది. రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, ఆపార్టీ విజయాలను, గత చరిత్రలను కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ ఆరు ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇచ్చారు.

Also read:Arvind Kejriwal: కనీస మర్యాద మరిచిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

అయితే ఒక రాజకీయ పార్టీ గురించి ఇలా పరీక్షలో ప్రశ్నలు రావడం కలకలం రేపింది. అందులోనూ రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర విద్యామంత్రిత్వశాఖ రాజస్థాన్ 12వ తరగతి బోర్డును ఆదేశించింది. పరీక్షలో ప్రశ్నలపై కేంద్రం కలగజేసుకోవడంపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి BD కల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Rahul Gandhi: పీకే నిర్ణయాన్ని రాహుల్ ముందే ఊహించారా?

రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్..బోర్డు పరీక్షలను నిర్వహించే స్వయంప్రతిపత్తి కలిగి ఉందని స్పష్టం చేశారు. “ప్రభుత్వ జోక్యం లేదు, బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వ నాయకులు అనవసరంగా మొత్తం విషయాన్ని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నారు, పరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ సిలబస్‌లోనే ఉన్నాయి, కొత్త వివాదాన్ని సృష్టించడానికి మాత్రమే రాష్ట్ర విషయాలలో కేంద్రం జోక్యం చేసుకుంటోంది. ఇది పూర్తిగా తప్పు” అని మంత్రి కల్లా అన్నారు.

Also read:Terror Letter: పంజాబ్ లో పేలుళ్లు సృష్టిస్తామంటూ జైష్-ఎ-మహమ్మద్ లేఖ: రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్