Nitin Gadkari: అంబులెన్స్‌లు, పోలీస్ సైరన్‌కు బదులుగా వినసొంపైన ఇండియన్ మ్యూజిక్!

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాహనాల హారన్‌లో భారతీయ సంగీతాన్ని మాత్రమే ఉపయోగించేలా చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Nitin Gadkari: అంబులెన్స్‌లు, పోలీస్ సైరన్‌కు బదులుగా వినసొంపైన ఇండియన్ మ్యూజిక్!

Nithin

Nitin Gadkari: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాహనాల హారన్‌లో భారతీయ సంగీతాన్ని మాత్రమే ఉపయోగించేలా చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అంబులెన్స్‌లు మరియు పోలీసు వాహనాలకు ఉపయోగించే సైరన్‌లను కూడా మార్చేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు నితిన్ గడ్కరీ. ఆల్ ఇండియా రేడియోలో ప్లే చేసే మెలోడియస్ ట్యూన్‌తో మామూలు హారన్‌ను భర్తీ చేయవచ్చునని తెలుస్తుంది.

నాసిక్‌లో జరిగిన హైవే ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన గడ్కరీ.. తాను ఎర్రని బీకాన్‌ను తన కాన్వాయ్‌కు తీసివేసినట్లు చెప్పారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణం అవుతున్న సైరన్‌లకు కూడా ముగింపు పలకాలని, అందుకోసం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. అంబులెన్స్‌లు, పోలీసులు ఉపయోగించే సైరన్‌ల విషయంలో కీలకమైన అధ్యయనం చేస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.

ఆకాశవాణిలో వినిపించే మ్యూజిక్ ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుందని, ప్రజలకు నచ్చేలా ట్యూన్‌ను అంబులెన్స్ కోసం ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుత సైరన్ చాలా కలవరపెడుతోందని, దీని వల్ల పొల్యూషన్ వస్తుందని, చెవులను కూడా దెబ్బతీస్తుందని చెప్పారు.

హారన్ల సౌండ్ వాహనదారులకు తలనొప్పిగా మారగా.. రహగొణధ్వనులతో రోడ్ల పక్కన నివశించేవారు కూడా విసిగిపోతున్నారని చెబుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే హారన్ సినారియోను మార్చేందుకు కేంద్రం ఈ ఆలోచన చేస్తుంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్‌ సౌండ్‌లను మార్చేసే దిశగా ఆలోచన చేస్తుంది.