పిచ్చి పిచ్చి వేషాలేస్తే..రూమ్‌లో వేసి బెల్టుతో చితక్కొడతాం : అధికారులపై కేంద్ర మంత్రి చిందులు

  • Published By: nagamani ,Published On : May 25, 2020 / 08:31 AM IST
పిచ్చి పిచ్చి వేషాలేస్తే..రూమ్‌లో వేసి బెల్టుతో చితక్కొడతాం : అధికారులపై కేంద్ర మంత్రి చిందులు

పిచ్చి పిచ్చి వేషాలేస్తూ..రూమ్ లో పెట్టి బెల్టుతో చితక్కొడతానంటూ అధికారులపై కేంద్ర కేంద్ర గిరిజ‌న‌శాఖ స‌హాయ మంత్రి రేణుకా సింగ్‌ చిందులేశారు. తనముందు నిలబడిని ఓ అధికారిపై కారాలు మిరియాలు నూరుతు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ విరుచుకుపడ్డారు. విధుల నిర్వహణలో నిజాయితీగా ఉండటం..బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్ధేశ్యం మంచిదే కానీ ఓ అధికారిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి సదరు మంత్రి అమ్మగారు ఎందుకు అలా మండిపడుతున్నారో తెలుసుకుందాం..

చ‌త్తీస్‌ఘ‌డ్‌ లోని బ‌ల‌రాంపూర్‌ ఉన్న క్వారెంటైన్ సెంట‌ర్‌ను మంత్రి రేణుకా సింగ్‌ సందర్శించారు. అధికారుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  ‘‘దాదాగిరి నహిన్ చాలేగి’’ (దాదాగిరి నడవదు) అంటూనే  పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారిని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు..రూముల్లోకి తీసుకువెళ్లి, బెల్టుతో కొట్ట‌డం త‌న‌కూ తెలుసు అని ఆమె ఆవేశంగా అన్నారు. 

బ‌ల‌రాంపూర్ క్వారెంటైన్ సెంట‌ర్‌లో ఉన్న దిలీప్ గుప్తా .. సెంట‌ర్‌లో వ‌స‌త‌ులు స‌రిగా లేవ‌ని ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసేందుకు త‌న‌పై అధికారులు దాడి చేసిన‌ట్లు సదరు అధికారి వాపోయారు. 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ఆ సెంట‌ర్‌ను సందర్శించారు.  మా ప్రభుత్వం (బీజేపీ) అధికారంలో లేద‌ని అనుకుంటున్నారా? మేము 15 ఏళ్లు పాలించాం..క‌రోనా వైర‌స్‌తో పోరాడేందుకు కేంద్రం దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి. అవసరానికి కావాల్సిన అన్ని నిధులు ఉన్నాయి. 

బీజేపీ కార్య‌క‌ర్త‌లు వీక్ గా ఉన్నారని అనుకుంటే పొరపాటు ఏమనుకుంటున్నారో..అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. అంతేకాదు..అక్క‌డున్న అధికారులందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చీక‌టి రూమ్‌లోకి తీసుకువెళ్లి బెల్ట్‌తో కొట్ట‌డం త‌న‌కు కూడా తెలుసు ఏమనుకుంటున్నారో..నంటూ వార్నింగ్ ఇచ్చేశారు. కాగా..చ‌త్తీస్‌ఘ‌డ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంది. దీంతో సదరు కేంద్ర మంత్రిగారు..కాంగ్రెస్ వారికి ధమ్కీ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతోనే అలా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. 

Read: 24 గంటల్లో 6,977 కొత్త కేసులు.. మరణాల సంఖ్య 4వేలు