#UnionBudget2023: వేతన జీవులకు ఊరట… ఆదాయపు పన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు
ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. నూతన పన్నుల విధానం ద్వారా రూ.3లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను ఉండదు. రూ.3-రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 5% పన్ను ఉంటుంది.

#UnionBudget2023
#UnionBudget2023: ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. నూతన పన్నుల విధానం ద్వారా రూ.3లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను ఉండదు.
రూ.3-రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 5% పన్ను ఉంటుంది. రూ.6 – రూ. 9 లక్షలు ఆదాయం ఉన్న వారికి 10 % పన్ను ఉంటుంది. రూ.9 -రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి- 15%, రూ.12 -రూ.15 లక్షల ఆదాయం ఉన్న వారికి- 20%, రూ.15 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి- 30% పన్ను ఉంటుంది. దీంతో వేతన జీవులను ఊరట ఇచ్చినట్లయింది. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని వేతన జీవులు చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఇప్పుడు వారి అభిలాష నెరవేరింది.
Personal #IncomeTax for the hardworking middle class
Currently, those with an income of Rs 5 lakhs do not pay any income tax and I proposed to increase the rebate limit to Rs 7 lakhs in the new tax regime
Finance Minister @nsitharaman
#Budget2023 #AmritKaalBudget pic.twitter.com/4PBNa3KsG5
— PIB India (@PIB_India) February 1, 2023
కేంద్ర బడ్జెట్ లో ఏడు ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇవాళ ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతూ… సమ్మిళిత వృద్ధి, దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడం, మౌలిక సదుపాయాలు కల్పించడం-పెట్టుబడులు, అన్ని వర్గాల వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, పర్యావరణసహితంగా ఆర్థిక అభివృద్ధి సాధించడం, దేశంలోని యువ శక్తి, దేశ ఆర్థికాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
#UnionBudget2023: రైల్వేకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు… 2013-2014 కంటే 9 రెట్లు అధికం