#UnionBudget2023: బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి: బడ్జెట్ పై కాంగ్రెస్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అలాగే, పేద గ్రామీణ కూలీలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం గురించి కూడా కేంద్రం తీరు సరిగ్గా లేని విమర్శించారు. కొన్ని ప్రాథమిక సందేహాలకు కూడా సమాధానం రాలేదని చెప్పారు.

#UnionBudget2023: బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అలాగే, పేద గ్రామీణ కూలీలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం గురించి కూడా కేంద్రం తీరు సరిగ్గా లేని విమర్శించారు. కొన్ని ప్రాథమిక సందేహాలకు కూడా సమాధానం రాలేదని చెప్పారు.
అలాగే, తక్కువ పన్నులు విధించే విధానాన్ని తాను నమ్ముతానని, పన్నులు తొలగించడం స్వాగతించే అంశమని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. ప్రజల చేతికి అధిక డబ్బు ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చినట్లేనని చెప్పారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అధిక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోవడంపై పరిష్కార మార్గాన్ని చూపలేదని కాంగ్రెస్ ఎంపీ గౌర్ గొగొయి అన్నారు. వాక్చాతుర్యాన్ని మాత్రమే ప్రదర్శించారని, పేదలకోసం ఏమీ ప్రకటించలేదని విమర్శించారు. బడ్జెట్ లబ్ధి కేవలం బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే ఆదాయపన్ను పరిమితి తక్కువగా పెంచారని అన్నారు. ధరలు, ద్రవ్యోల్బణం పెరగాయని గుర్తు చేశారు.
#UnionBudget2023: వేతన జీవులకు ఊరట… ఆదాయపు పన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు