Laughter Protest : రోడ్ల దుస్థితిపై నవ్వుల నిరసన

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రోడ్ల దుస్థితిపై పెద్దలు,మహిళలు,చిన్నారులందరూ కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

Laughter Protest : రోడ్ల దుస్థితిపై నవ్వుల నిరసన

Bhopal

Laughter Protest :  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రోడ్ల దుస్థితిపై పెద్దలు,మహిళలు,చిన్నారులందరూ కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అధ్వాన్నమైన రోడ్లకు మరమ్మతులు చేయడంలో అధికారుల అసమర్థతను అందరికీ చాటి చెప్పేలా రోడ్ల పక్కన నిలబడి పెద్దగా నిరసన తెలిపారు.

భోపాల్ లోని ఆనంద్‌ విహార్ కాలనీలో వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో రహదారి ధ్వంసమైంది. అధికారుల చుట్టూ తిరిగితే రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. రెండేళ్లు గడిచినా నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఎవరిని అడిగినా సమాధానమూ రావడంలేదు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు స్థానికులు వినూత్న మార్గం ఎంచుకున్నారు.

200 మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడి పెద్ద పెట్టున్న నవ్వుతూ నిరసన తెలిపారు. రోడ్డును వెంటనే నిర్మించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో ఆందోళన నిర్వహిస్తే కొంతవరకు పనులు మొదలు పెట్టి మళ్లీ ఆపేశారని స్థానికులు చెప్పారు. అందుకే మళ్లీ నిరసనబాట పట్టినట్లు చెప్పారు.

ALSO READ Param Bir Singh : అజ్ణాతం వీడనున్న పరంబీర్​ సింగ్​..సుప్రీం తీర్పుతో 48 గంటల్లొ సీబీఐ ముందుకు