Unlock 4.0 : ఇక సందడే సందడి.. బార్‌లు, పబ్‌లకు గ్రీన్ సిగ్నల్..!

  • Published By: sreehari ,Published On : August 31, 2020 / 09:24 PM IST
Unlock 4.0 : ఇక సందడే సందడి.. బార్‌లు, పబ్‌లకు గ్రీన్ సిగ్నల్..!

కరోనా మహమ్మారితో వినోదత్మక కార్యక్రమాలు మూగబోయ్యాయి.. వీకండ్ వస్తే చాలు.. డీజే స్టెప్పులతో సందడిగా ఉండే పబ్ లు, బార్ లు, క్లబ్ లు కరోనా దెబ్బకు మూతపడ్డాయి.. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం.. పబ్, క్లబ్, బార్లకు అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి.



అదేరోజు నుంచి పబ్‌లు, బార్‌లు, క్లబ్‌లకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని పేర్కొంది. కానీ కండీషన్ పెట్టింది.. సీటింగ్‌ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్‌ మంత్రి హెచ్‌ నాగేష్‌ సూచించారు.



కరోనా వైరస్‌ నేపథ్యంలో సీటింగ్‌ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే అనుమతించాలని సూచించారు. భౌతిక దూరం సహా ఇతర కోవిడ్‌-19 నిబంధనలను పాటించాలని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.



దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకూ రూ.1435 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ప్రభుత్వానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపారు.