ముందస్తు సన్నద్ధతలేకపోవడం, అకస్మాత్తు ప్రకటనలే మోడీ ప్రభుత్వ అజెండానా? అందుకే వలస కార్మికుల సమస్య తీవ్రమైందా?

ముందస్తు సన్నద్ధతలేకపోవడం, అకస్మాత్తు ప్రకటనలే మోడీ ప్రభుత్వ అజెండానా? అందుకే వలస కార్మికుల సమస్య తీవ్రమైందా?
ad

ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 19న జనతా కర్ఫ్యూ ప్రకటించి మార్చి 22న నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ రోజు చివర్లోనూ లాక్ డౌన్ గురించి ప్రస్తావించలేదు. పలు రాష్ట్రాలు సమస్యకు తగినట్లు స్పందించి స్వయంగా లాక్ డౌన్ ప్రకటించేశాయి. దేశంలో మార్చి 25 అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమలు చేశారు.

అప్పటికీ దేశంలో కరోనా కేసు నమోదై 5వ రోజులు పూర్తయ్యాయి. ఒకవేళ ఆలస్యమైనా దేశం మొత్తాన్ని సిద్దం చేసిన తర్వాత లాక్ డౌన్ చేయించారా.. అంటే అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సమయానికి ఎక్కడివాళ్లు అక్కడే ఉంటూ మానసికంగానూ సిద్ధం కాలేరు. 

ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లలో జరుగుతున్న అంశాలను పరిశీలించిన మీదటే ప్రధాని టీవీ కాన్ఫిరెన్స్ పెట్టి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ముందు సిద్ధంగా లేకపోవడం మోడీ ప్రభుత్వానికి ఓ సూచనలా మారింది. జనవరి 30న తొలి కేసు బయటపడ్డప్పుడే జాగ్రత్త పడాల్సింది.

1. అసలు ఇండియా చేసే పొరబాట్లలో ప్రథమంగా టెస్టింగ్. ఎమిడెమియాలజస్ట్‌లు, మెడికల్ ఎక్స్‌పర్ట్‌లు మరిన్ని టెస్టులకు రెడీకాక ముందే లాక్ డౌన్ ప్రకటించడం. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎట్టకేలకు రోజుకు 12వేల టెస్టులు మాత్రమే చేయగల్గుతున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ సైతం గందరగోళంతో పాటు క్లారిటీ లేకుండాపోయింది.

2. టెస్టుల అనంతరం 724మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ ఐసీఎమ్ఆర్ సరిగా స్పందించలేదు. స్టేజి2కు వచ్చే వరకూ ఇదే పరిస్థితి. 

3. భారతదేశానికి 7లక్షల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ కావాల్సి ఉంది. కోటికి పైగా మాస్కుల అవసరముంది. ప్రస్తుతం ఎన్ని అందుబాటులో ఉన్నాయనే దానిపైనా క్లారిటీ లేదు 

4. వెంటిలేటర్లు, వ్యాధి నిరోధకానికి వాడే పరికరాలు, శానిటైజర్లు ఎగుమతి చేయకముందే లాక్ డౌన్ చేయడంతో వాటి డిమాండ్ పెరిగిపోయింది. 

5. కిరాణా షాపులు, నిత్యవసర వస్తువుల స్టోర్లు మూసేశారు. దానికి కారణం కేవలం సరఫరా నిలిపివేయడం. దాంతో పాటు షాపులు వెళ్లి కొనుగోలు చేయడానికి ఎవ్వరినీ అనుమతించకపోవడం. 

6. రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే తీరులో సందేహమే లేదు. ఏ మాత్రం సూచనలు ఇవ్వకుండా లాక్ డౌన్ ను అతిక్రమించిన వారిని బాదుతూనే ఉన్నారు. డెలివరీ ఏజెంట్లను లాఠీలతో కొడుతూ, అనూహ్యమైన శిక్షలు విధిస్తుంటే వీడియోలు వైరల్ గా మారి హాస్యాస్పదంగా తయారవుతున్నాయి. 

దీనిపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శనివారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ముందుగా ఎటువంటి ప్లానింగ్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు.