Galwan Valley Clash : గల్వాన్ ఘర్షణ..మరో వీడియో విడుదల

గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.

Galwan Valley Clash : గల్వాన్ ఘర్షణ..మరో వీడియో విడుదల

Galwan

Galwan Valley Clash గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. బోర్డర్ లో నెలకొన్న సమస్యల పరిష్కరం కోసం భారత్-చైనా ఆర్మీ అధికారులు నిర్వహించిన పన్నెండో విడత సైనిక చర్చలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన రోజే(సోమవారం-2,2021) చైనా అధికారిక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ CGTN తన ట్విట్టర్ హ్యాండిల్ మరియు వెబ్ సైట్ లో గల్వాన్ ఘర్షణల వీడియోని విడుదల చేసింది. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడిమోలోని దృశ్యాలు గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించినవేనని అందులో పేర్కొన్నారు.

ఈ వీడియోలో భారత సైనికులపైకి.. చైనా సైనికులు రాళ్లు రువ్వడం, గల్వాన్ నదిని దాటేందుకు పీఎల్ఏ సైన్యం ప్రయత్నించడం కనిపిస్తోంది. ఘర్షణలో మరణించిన పీఎల్ఏ సైనికుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూకి సంబంధించిన దృశ్యాలు సైతం అందులో ఉన్నాయి. సైన్యం సహాయక చర్యల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

అయితే, గతంలో గల్వాన్ ఘర్షణకు సంబంధించి చైనా ఓ ఫేక్ వీడియోను విడుదల చేసి.. భారత సైన్యమే దాడికి పాల్పడిందని చెప్పుకురావడం,ఆ వాదనను భారత అధికారులు కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

కాగా, గతేడాది జూన్ నెలలో గల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, అంతకన్నా రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు చనిపోయారు. అయితే చైనా మాత్రం ప్రాణనష్టంపై వివరాలను దాచిపెడుతోంది. తొలుత ఎవరూ చనిపోలేదని బుకాయించి.. ఆ తర్వాత నలుగురు మాత్రమే మరణించారని ప్రకటించింది. అప్పటి నుంచి సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పలు దఫాలుగా చర్చించిన తర్వాత ఫిబ్రవరిలో సైనిక ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరాల్లో మోహరించిన సైన్యాన్ని ఇరుదేశాలు ఉపసంహరించుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై భారత్-చైనా సైన్యాలు జులై 31న 12వ విడత చర్చలు జరిపాయి.
Read India-China Military Talks : సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత..భారత్-చైనా అంగీకారం