UP: ‘చెడు నుంచి కాపాడు అల్లా’ అంటూ మార్నింగ్ ప్రేయర్ చేసిన విద్యార్థులు.. స్కూలు ప్రిన్సిపాల్ సస్పెండ్
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, విద్యార్థుల్ని మత మార్పిడి చేయడానికి ప్లాన్ జరుగుతోందని సైతం ఆరోపణలు గుప్పించింది.

UP: ఉత్తప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉదయం చేసే ప్రార్థనలో ఒక మతానికి చెందిన గీతాన్ని ఆలపించారనే కారణంతో సదరు పాఠశాల ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసిన ఆ రాష్ట్ర విద్యా శాఖ. ‘మేరే అల్లా బురాయి సే బచానా ముజ్కో’ అంటూ విద్యార్థులు చేసిన ప్రార్థనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ప్రముఖ ఉర్దూ రచయిత మహ్మద్ ఇక్బాల్ రాసిన మరో గీతం ‘లబ్ పే ఆతి హై దువా బన్కే తమన్నా మేరి’ అనేది కూడా ఆలపించారు. మహ్మద్ ఇక్బాల్ గురించి తెలిసే ఉంటుంది. ‘సారే జహాసే అచ్చా, హిందుస్తాన్ హమారా’ అనే గీత రచయిత.
ఇకపోతే, సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, విద్యార్థుల్ని మత మార్పిడి చేయడానికి ప్లాన్ జరుగుతోందని సైతం ఆరోపణలు గుప్పించింది. వీహెచ్పీ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ, వెంటనే చర్యలకు దిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ నహిద్ సిద్ధిఖీనతో పాటు టీచర్ వజ్రుద్దీన్ను సస్పెండ్ చేసింది. మత విశ్వాసాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అంతే కాకుండా, ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని సైతం నియమించినట్లు విద్యాశాఖ పేర్కొంది.
Delhi Mayor: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆప్ .. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్