UP Crime : 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

మహిళలపై తరచు నేరాలు జరిగే ఉత్తరప్రదేశ్ లో మరోదారుణం జరిగింది. 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మరోసారి సంచలనం కలిగించింది. బరేలీలో 19 ఏళ్ల యువతిపై పలువురు యువకులు అత్యాచారానికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

UP Crime : 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

Up 19 Years Dalith Woman Gangraped In Bareilly 3 Arrested

UP dalith woman Gang raped : యూపీలో మహిళలు, యువతులు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయి యూపీలో. ఈక్రమంలో మరో యువతి జీవితాన్ని చిదిమేసారు మృగాళ్లు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. బరేలీ నగరంలోని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 31న ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయగా పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం (జూన్ 7) మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ సింగ్ సజ్వాన్ మాట్లాడుతూ.. బాధిత యువతి తన ఇద్దరు యువకులతో కలిసి స్కూటీపై బయటకు వెళ్లింది. స్కూటీపై వెళుతున్న అమ్మాయిలను ఓ యువకుడు అడ్డగించాడు. తన స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వారు వచ్చాక..స్నేహితులతో కలిసి ఆమెను స్నేహితులను ఎదురు తిరిగితే చంపిపారేస్తామని బెదిరించేసరికి వారు అక్కడ నుంచి పారిపోయారు. ఆ తరువాత యువతిపై వారంతా అత్యాచారం చేసి..ఆమె దగ్గరున్న డబ్బు తీసుకని పరారయ్యారు. వెళుతూ వెళుతూ..ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు.

దీంతో భయపడిపోయిన ఆమె జరిగిన ఘోరం గురించి బయటకు చెప్పలేదు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. తన సోదరికి..కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో గత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్నారు. యువతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం నిందితులను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

కాగా..గత ఆదివారం నిందితులను పట్టుకోవటానికి పోలీసులు యత్నింస్తుండగా..పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెనక్కి తగ్గని పోలీసులు ఓ నిందితుడి కాలుపై కాల్చడంతో విశాల్ పటేల్ అనే 22 ఏళ్ల యువకుడితో పాటు అనుజ్ పటేల్ అనే 23 ఏళ్ల యువకుడు పోలీసులకు చిక్కారు. అనంతరం సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలినవారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నామని సూపరింటెండెంట్ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.