సర్పంచ్ గారూ అనిపించుకోవాలి: ఆ కల కోసమే పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి

సర్పంచ్ గారూ అనిపించుకోవాలి: ఆ కల కోసమే పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి

Sarpanch Dream 45 Year Old  Man Gets Married

Sarpanch Dream 45 year old  man gets married : సర్పంచ్ అవ్వాలనే కల నెరవేర్చుకోవటం కోసమే 45 ఏళ్ల వయస్సు వరకూ పెళ్లి ఊసెత్తని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. సర్పంచ్ అవ్వాలని ఎంతగా తపించాడు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అలా తనను నమ్మి ఓట్లు వేస్తారు కదా..అనుకున్నాడు. కానీ అతని కల నెరవేరలేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. గ్రామ సర్పంచ్ కావాలన్న కోరికతో విస్తృతంగా పలు సామాజిక సేవలు చేశాడు. అది కేవలం పదవి కోసమే కాదు..సమాజానాకి ఏదైనా చేయాలనే తపనతో. తన సేవలను మరింతగా విస్తతం చేయాలంటే గ్రామ సర్పంచ్ అయితే ఇంకా చేయొచ్చుకదానుకున్నాడు. ఈ సారి ఎలాగైనా సర్పంచ్ గా నిలబడి గెలిచి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. రిజర్వేషన్ రూపంలో మరోసారి ఆకలకు గండిపడింది. సదరు వ్యక్తి గ్రామం సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ కావటంతో మరోసారి భంగపడ్డారు. కానీ తన కల ఎలాగైనా నెరవేర్చుకోవాలనే తపనతో 45 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసకున్నాడు యూపీలోని బాల్లియా జిల్లా కరణ్ చాప్రాకు చెందిన వ్యక్తి..

యూపీలోని బాల్లియా జిల్లా కరణ్ చాప్రా గ్రామంలో హాతి సింగ్ అనే వ్యక్తి 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. రెండో స్థానంలో నిలిచాడు. ఈసారైనా సర్పంచ్‌గా గెలిచితీరాలని అతడు ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఆ గ్రామం మహిళా రిజర్వ్ కావటంతో మరోసారి అతని ఆశలపై నీళ్లు పడినట్లైంది. సర్పంచ్ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీచేసే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఇప్పటికైనా పెళ్లిచేసుకుని భార్యను ఎన్నికల్లో నిలబెట్టాలంటూ హాతి సింగ్ అభిమానులు అతడికి సలహా ఇచ్చారు. దీంతో వెంటనే పెళ్లికి రెడీ అయిపోయాడు హాతి సింగ్. మార్చి 26,2021 తన గ్రామంలోని ఓ ఆలయంలో ఆత్మీయుల మధ్య వివాహం చేసుకున్నాడు.

హాతిసింగ్ వారి ఆచారం ప్రకారం ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోయినప్పటికీ హడావిడిగా పెళ్లి చేసుకోవడం మరో విశేషం. దానికి కారణం ‘‘ఏప్రిల్ 13లోపు నామినేషన్ వేయాల్సి ఉంది. దీంతో వెంటనే వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. తన తల్లికి 80 ఏళ్లు దాటినందున ఆమెను పోటీ చేయించడం కుదరదనీ..కానీ ఎలాగైనా సరే తమ కుటుంబంలో ఓ సర్పంచ్ ఉండాలనే ఉద్ధేశ్యంతో ముహూర్తాలు లేకపోయినా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

‘‘గత ఐదేళ్లుగా నేను ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా మద్దతుదారులు కూడా నాకోసం బాగా ప్రచారం చేస్తున్నారు. కేవలం నా మద్దతుదారుల కోరిక మేరకే పెళ్లి చేసుకున్నాననీ..అంతేతప్ప తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయాన్ని కూడా మార్చుకున్నానని తెలిపాడు. కాగా వివాహం చేసుకున్న మహిళ కూడా ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. తన భర్త సర్పంచ్ కాకపోయినా..సర్పంచ్ మొగుడు అవుతాడని అనటం గమనించాల్సిన విషయం..! అంటే భర్తకు తగిన భార్య అన్నమాట..