ఎలుకలు తినేసి పసిగుడ్డు మృతి..మృతదేహాన్ని డీప్ ఫ్రిజ్ లో పెట్టిన హాస్పిటల్ సిబ్బంది

  • Published By: nagamani ,Published On : November 26, 2020 / 11:08 AM IST
ఎలుకలు తినేసి పసిగుడ్డు మృతి..మృతదేహాన్ని డీప్ ఫ్రిజ్ లో పెట్టిన హాస్పిటల్ సిబ్బంది

UP : Aligarh : వేలకు వేలు ఫీజులు గుంజే ప్రయివేటు హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ పసిగుడ్డు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చి పట్టుమని 10 రోజులుకూడా గడవకముందే ఎలుకలు కొరికి తినేయటంతో ఆ పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలిఘడ్ లోని ఓ ప్రవేటు హాస్పిటల్ లో జరిగింది.




https://10tv.in/now-sabarimala-pilgrims-get-medicinal-drinking-water-in-bottles/
ఆ చనిపోయిన శిశువుని డీప్ ఫ్రిజ్ లో దాచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి నా బిడ్డ బలైపోయిందంటూ గుండెలవిసేలా ఏడ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు.


వివరాల్లోకి వెళితే..యూపీలోని అలీగఢ్‌లోగల అలీగఢ్‌కు చెందిన రాజేష్ కుమార్ భార్య సప్నా దేవిని ప్రసవం కోసం గత ఆదివారం (నవంబరు 22,2020)న కీర్తి ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. అదే రోజు రాత్రి 11 గంటలకు సప్నా దేవి ఆడపిల్లకు జన్మినిచ్చింది. ప్రసవించిన తరువాత శిశువు చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది తల్లిదండ్రులకు తెలిపారు. కానీ బిడ్డను చూపించాలని సప్నాదేవి అడగటంతో బట్టల్లో చుట్టి శిశువును చూపించి తిరిగి తీసుకెళ్లిపోయారు. అలా తీసుకెళ్లిన ఆ శిశువుని డీప్ ఫ్రిజ్ లో పెట్టారు.



ఆ మర్నాడు తమకు ఆ శిశువు మృతదేహాన్ని మాకు అప్పగించండీ ఖననం చేస్తామని రాజేశ్ కుమార్ అడిగాడు. దానికి శిశువు మృతదేహన్ని అప్పగించగా ఆఖరిసారి బిడ్డను చూసుకుందామనుకున్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు.



అప్పటికే ఎలుకలు కొరికివేసినట్లుగా గుర్తించారు. తమ బిడ్డ పుట్టిన వెంటనే చనిపోలేదేని హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బిడ్డను ఎలుకలు కొరికి తినేటయం వల్ల చనిపోయిందని గుర్తించారు. దీనిపై సిబ్బందిని నిలదీయగా..దురుసుగా సమాధానం చెప్పారు. ఫీజు ఎగ్గొట్టటానికి మాపై నిందలు వేస్తున్నారని ఎదురు తిరిగి బాధిత తల్లిదండ్రులతో గొడవకు దిగారు.



దీంతో రాజేష్ కుమార్..సప్నాదేవి కన్నీటితో బిడ్డను పోగొట్టుకుని మేం బాధపడుతుంటే ఇలాగేనా మీరు మాట్లాడేది..బిడ్డకంటే మాకు ఫీజు ఎక్కువకాదని చెప్పారు.అయినా వినని హాస్పిటల్ సిబ్బంది వారిని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటంతో..రాజేష్ కుమార్ బాధతోనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నిచారు.


ఈ విషయంపై సీఎంఓ డాక్టర్ బీపీ సింగ్ మాట్లాడుతూ.. ఆ శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయా లేదా అనే దానిపై విచారణ చేపట్టనున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఈ విషయం తెలుస్తుందన్నారు. రిపోర్ట్ వచ్చాక బాధితులు ఆరోపణలు నిజమైతే దీనికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో తేల్చాలని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రభూషణ సింగ్ ఆదేశించారు.