Holi 2023..Aligarh Mosque : అందుకే అలీఘఢ్ మసీదును టార్పాలిన్ కవర్లతో కప్పేసాం
అలీఘఢ్ మసీదును టార్పాలిన్ కవర్లతో కప్పేసారు నిర్వహాకులు. ఎందుకంటే..

Holi 2023..Aligarh mosque
Holi 2023 ..Aligarh mosque : ఉత్తరప్రదేశ్ అలీఘఢ్ ( Aligarh)లోని ఓ మసీదును టార్పాలిన్ కవర్లతో కప్పేశారు అధికారులు. మార్చి 8 (2023) హోలీ పండుగ సందర్భంగా (Holi celebrations) సందర్భంగా మసీదుకు రంగులు అంటకుండా ఉండేందుకు మసీదును టార్పాలిన్‌తో కప్పేశామని అధికారులు తెలిపారు. “శాంతి మరియు శాంతిని కాపాడటానికి” మసీదు కవర్ చేశామని మసీదు పరిపాలన అధికారులు తెలిపారు.
అలీఘఢ్‌లోని అత్యంత సున్నితమైన క్రాస్‌రోడ్‌లో అబ్ధుల్ కీరం మసీదుకు హోళీ వేడుకల్లో మసీదుకు ఎవరూ రంగులు పులమకుండా ఉండేందుకు సోమవారం (మార్చి రాత్రి6,2023) టార్పాలిన్ కవర్లతో కప్పేశారు. అధికారుల సూచనలకు అనుగుణంగా మసీదులో ఈ ఏర్పాట్లు చేశామని..మసీదుపైకి ఎవరూ రంగులే కాకుండా ఇతర వ్యర్ధాలను విసిరే అవకాశం ఉండదని మసీదు నిర్వహణ కమిటీకి చెందిన హాజి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు.