Lockdown : ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు..మెట్రో సేవలు బంద్

ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

Lockdown : ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు..మెట్రో సేవలు బంద్

Lock Down Delhi, UP

UP And Delhi : భారతదేశంలో కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉంటుండడంతో కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ విధిస్తూ..కరోనాకు వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కొద్దిగా అదుపులోకి వచ్చినా..లాక్ డౌన్ లను రాష్ట్రాలు పొడిగిస్తున్నాయి. తాజాగా..ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వరకు ఈ లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2021, మే 10వ తేదీ సోమవారం నుంచి మెట్రో సర్వీసులను కూడా నిలిపి వేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

మే 17 వరకు బంద్ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగానే కేసుల తీవ్రత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. అందుకే మరోసారి లాక్ డౌన్ పొడిగించడం జరుగుతోందని తెలిపారు. లాక్‌డౌన్ కార‌ణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి త‌గ్గిందని, 2021, మే 08వ తేదీ శనివారం 17,364 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజ‌న్ కొర‌త త‌గ్గిందని, అంతేగాకుండా..వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోందన్నారు.

ఇక యూపీ విషయానికి వస్తే..కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించిన యూపీ సర్కార్..మరోసారి పొడిగిస్తూ..నిర్ణయం తీసుకుంది. మే 17వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. లాక్ డౌన్ తప్ప మరొక మార్గం లేకపోవడంతో దీనిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు జరుగుతోంది.

Read More :  Gattu Vaman Rao : పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు